Telangana High Court : ఉస్మానియా భవన నిర్మాణంపై అలసత్వం ఎందుకు ? ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణంపై అలసత్వం ఎందుకని సూటిగా ప్రశ్నించింది. హెరిటేజ్ భవనం మినహా..మిగతా బ్లాక్ ల్లో నిర్మించలేరా ? అని ప్రశ్నించగా..దీనికి ఏజీ సమాధానం ఇచ్చారు.

Tg High Court
High Court : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణంపై అలసత్వం ఎందుకని సూటిగా ప్రశ్నించింది. హెరిటేజ్ భవనం మినహా..మిగతా బ్లాక్ ల్లో నిర్మించలేరా ? అని ప్రశ్నించగా..దీనికి ఏజీ సమాధానం ఇచ్చారు. నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం కావాలని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ తీరు దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆసుపత్రి సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ ఎందుకు సమర్పించలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు వారాల్లో…నిర్ణయం తీసుకోవాలని, బ్లూ ప్రింట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉస్మానియా ఆసుపత్రి వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రి మొత్తం కూల్చివేసి..అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే..ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ..కొన్ని పౌర సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశాయి. హెరిటేజ్ బిల్డింగ్ పై కూడా గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. హెరిటేజ్ బిల్డింగ్ కాకుండా..ఇతర బ్లాక్ ల విషయంలో వివరాలు సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకు వివరాలు సమర్పించకపోవడం పట్ల..తాజాగా..హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అన్ని అంశాలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని, త్వరలోనే..పూర్తి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఏజీ హైకోర్టుకు వెల్లడించారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ నియంత్రణపై దృష్టి సారించారని ఏజీ తెలిపారు. ఆరు వారాల్లో..పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.