Shadnagar MLA: షాద్‌న‌గ‌ర్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ

ఓ సామాజిక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడిన కాంగ్రెస్ నేత, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై టీపీసీసీ సీరియస్ అయింది.

Mahesh Kumar Goud

Shadnagar MLA Veerlapally Shankar: ఓ సామాజిక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడిన కాంగ్రెస్ నేత, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై టీపీసీసీ సీరియస్ అయింది. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. ఓ సామాజిక వర్గాన్ని కించపరచడం కాంగ్రెస్ సిద్ధాంతం కాదని అన్నారు. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే శంకర్ తన వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది.

Also Read: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. వేములవాడ రాజన్న ఆలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన

ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. గడచిన పదేళ్ల కాలంలో వెలమ దొరల పాలనలో రాష్ట్రం మొత్తం దివాళా తీసిందని, తెలంగాణలో వెలమలను లేకుండా చేయాలంటూ, రాష్ట్రంలో ఇక మీదట వెలమల ఆటలు సాగవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆ సామాజిక వర్గం నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

 

అయితే, తన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ క్లారిటీ ఇచ్చారు. తప్పుగా భావిస్తే నా మాటలను ఉపసంహరించుకుంటునట్లు తెలిపారు. నియంతృత్వ ధోరణి అవలంభించే వారిని మాత్రమే నేను విమర్శించాను, వెలమలని ఉద్దేశించి అలా మాట్లాడలేదని అన్నారు. నేను మాట్లాడిన మాటలను వెనుక ముందు కత్తిరించి పెట్టారని, నేను ఒక శాసనసభ్యుడిని అందరినీ గౌరవిస్తానని శంకర్ పేర్కొన్నారు.