Hyderabad : హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో విషాదం, మంట్లలో చిక్కుకుని భర్త మృతి

Tragedy In Hyderabad : మల్కాజ్ గిరి ప్రేమ్ విజయనగర్ కాలనీ వెంకటేశ్వర అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న రాఘవరావు(82), ఆయన భార్య రాఘవమ్మ(79) దీపాలు వెలిగిస్తున్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో విషాదం, మంట్లలో చిక్కుకుని భర్త మృతి

Tragedy In Hyderabad (Photo : Google)

దీపావళి పండుగ వేళ హైదరాబాద్ లో విషాదం నెలకొంది. దీపాల పండుగ దీపావళి ఓ ఇంట్లో ట్రాజడీ నింపింది. భార్యను కాపాడబోయిన భర్త మరణించాడు. మల్కాజ్ గిరిలో ఈ ఘటన జరిగింది.

మల్కాజ్ గిరి ప్రేమ్ విజయనగర్ కాలనీ వెంకటేశ్వర అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న రాఘవరావు(82), ఆయన భార్య రాఘవమ్మ(79) దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఇంట్లో దీపాలు వెలిగిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు రాఘవమ్మ చీరకు మంటలు అంటుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో భర్త రాఘవరావు తీవ్రంగా గాయపడి చనిపోయారు. భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మరోవైపు ఏపీలోనూ దీపావళి వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. బాపట్లలో రాకెట్ ఎగిరి గుడిపై పడింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా దగ్దమైంది. అటు విశాఖ, గుంటూరు నగరాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి.

Also Read : బాణసంచా కాల్చుతూ మీ చేతులు కాలిపోయితే భయపడొద్దు.. వెంటనే ఈ పని చేయండి

పటాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి.
* గుడిసెలు, గడ్డివాముల దగ్గర టపాకులు కాల్చొద్దు.
* కాలని, పేలని వాటి జోలికి వెళ్లొద్దు, తిరిగి వెలిగించే ప్రయత్నం అసలే చేయెద్దు.
* నీళ్ల బకెట్ పక్కనే పెట్టుకోవాలి.
* తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి.
* అగ్గిపుల్లలు వాడొద్దు. బదులుగా కొవ్వొత్తులు, అగరబత్తులతో పటాసులు వెలిగించాలి.
* క్రాకర్స్ ను గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకూడదు.
* బట్టలపై నిప్పురవ్వు పడితే వెంటనే ఒంటిపై దుప్పటి కప్పాలి.

కాలిన గాయాలకు ఇవి మాత్రం రాయొద్దు..
* టపాసులు పేల్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్న చిన్న చిన్న గాయాలు అవుతాయి.
* ఆ గాయాలకు ఏది పడితే అది రాయొద్దు.
* ఐస్ క్యూబ్స్, టూత్ పేస్ట్, పసుపు, నెయ్యి, వెన్న వంటి చిట్కాలు వద్దు.
* యాంటీ బయోటిక్ ఆయింట్ మెంట్ రాయాలి.
* వదులుగా వస్త్రాన్ని కట్టాలి.
* దీని వల్ల గాయం త్వరగా మానేందుకు అవకాశం లభిస్తుందన్న వైద్య నిపుణులు.