Food Contamination: బాబోయ్.. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మటన్ తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. ప్రాణాలే పోయాయ్..

దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.

Food Contamination: ఫ్రిజ్ లో నిల్వ చేసిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? అయితే బీకేర్ ఫుల్… ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే.. ఫ్రిజ్ లో నిల్వ ఉంచి వేడి చేసిన మాంసాహారం తిని ఒకరు చనిపోయారు. మరో ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్ నగరం వనస్థలిపురంలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది.

ఆదివారం బోనాల పండగ సందర్భంగా శ్రీనివాస్‌ అనే వ్యక్తి మటన్‌ తెచ్చుకున్నారు. ఆ రాత్రి వండుకుని కుటుంబ సభ్యులు తిన్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు. సోమవారం ఆ మాంసాన్ని వేడి చేసి మళ్లీ తిన్నారు. అంతే ఒక్కసారిగా కుటుంబసభ్యులు అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస్‌ మృతి చెందారు. మిగిలిన ఏడుగురు చికిత్స పొందుతున్నారు.

Also Read: లాభాల పేరుతో ఘరానా మోసం.. సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మి 13 లక్షలు పొగొట్టుకున్నాడు

ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మాంసాహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం వారి ప్రాణాల మీదకు తెచ్చిందంటున్నారు. ఆహారం విషపూరితం కావడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందంటున్నారు. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఆహారం మరీ ముఖ్యంగా నాన్ వెజ్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు డాక్టర్లు. మాంసాహారం ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం, తర్వాత వేడి చేసుకుని తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు. ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దంటున్నారు. ఒక వేళ ఆహారం మిగిలితే బయటపడేయటమే మంచిందంటున్నారు.