BJP MP Aravind : ఆయనతో కంటే అసెంబ్లీ చెప్రాసీతో మాట్లాడేది మేలు- జీవన్ రెడ్డి
బీజేపీపై రైతులు నిరసన తెలియచేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జురుగుతోందని...యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీ నేతలను రైతులు అడ్డుకుంటున్నారనే విషయాన్ని చెప్పారు. టీఆర్ఎస్ అడ్డుకుందని...

Armoor Mla Jeevan Reddy
TRS MLA Jeevan Reddy : బీజేపీ ఎంపీ అరవింద్ కు దమ్ముంటే ఆర్ముర్ లో పోటీ చేసేందుకు ముందుకు రావాలని, ఆయనకు డిపాజిట్ దక్కకుండా తాను విజయం సాధిస్తానన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఒకే ఇంట్లో ముగ్గురు నేతలు.. మూడు పార్టీలు ఉన్నది ఆ ఇంట్లోనేనని ఎద్దేవా చేశారు. అరవింద్ తో చర్చలు జరిపే కంటే అసెంబ్లీలో చెప్రాసీతో చర్చలు జరిపింది మేలన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ను అడ్డుకోవడంపై ఆ పార్టీ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించింది. టీఆర్ఎస్ వచ్చి అడ్డుకుందని తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. 2022, జనవరి 26వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More : Bike Launch: భారత మార్కెట్లోకి హోండా CBR650R 2022 మోడల్, ధర ఎంతో తెలుసా?
బీజేపీపై రైతులు నిరసన తెలియచేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జురుగుతోందని…యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీ నేతలను రైతులు అడ్డుకుంటున్నారనే విషయాన్ని చెప్పారు. టీఆర్ఎస్ అడ్డుకుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గత రెండున్నరేళ్లుగా ఏనాడు ఆయన్ను అడ్డుకోలేదన్నారు. నేను తోపు అంటేనే రైతులు ఆపారని వివరించారు. రైతు వర్గం మాత్రమే అరవింద్ పై నిరసన తెలియచేసిందన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులు కూడా అరవింద్ ను ఉరికించే రోజులు దగ్గరిలో ఉన్నాయన్నారు. బీజేపీ నేతల ఆటలు రాష్ట్రంలో సాగనివ్వమని, హామీలు అమలు చేయకపోతే బీజేపీ నేతలను నిలదీస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు.