Parliament Meetings: కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్

గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.

Trs

Parliament Meetings: గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. మంత్రి బిశ్వేశ్వర్ తుడును తొలగించాలని లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేపట్టారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి మార్చి 21న కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు అందలేదని సభకు తెలిపారు. అయితే గిరిజన రిజర్వేషన్ల అంశంపై 2017లోనే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు పంపిందన్న టిఆర్ఎస్ ఎంపీలు..కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఇచ్చిన సమాధానం పార్లమెంట్ ను తప్పుదారి పట్టించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడును తొలగించాలని డిమాండ్ చేశారు.

Also Read:Lord Shiva: ప్రభుత్వభూమిని ఆక్రమించారంటూ “పరమశివుడికే” కోర్టు నోటీసు

తుడు పై రూల్ 222 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన టిఆర్ఎస్ ఎంపీలు..ఆమేరకు 9 మంది ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసు పై సంతకం చేసి..లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. అనంతరం గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు క్షమాపణ చెప్పాలని లోక్ సభలో ఆందోళన చేపట్టిన టిఆర్ఎస్ ఎంపీలు కేంద్రం తక్షణమే స్పందించి గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు రిజర్వేషన్ల సమస్యలపై తెలంగాణ నుండి ఎటువంటి ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి సమాధానాన్ని టిఆర్ఎస్ ఎంపీలు ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ప్రతిపాదనలు చేయడమే కాకుండా 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ 2017లో అసెంబ్లీ ఆమోదించిందని..ఆ బిల్లును కేంద్ర హోంశాఖ, గిరిజనశాఖకు పంపిందని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు అంశం తమ వద్దకు వచ్చిందని గతంలో ఆయా శాఖలు కూడా తెలిపాయని టిఆర్ఎస్ ఎంపీలు అన్నారు.

Also Read:AP Assembly: అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు