AP Assembly: అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు
ఈలలు, చిడతలతో సభకు అంతరాయం కలిగిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. మంగళవారం శాసన మండలిలో ఈలలు వేసి గోల చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, బుధవారం అసెంబ్లీలోకి చిడతలు తీసుకొచ్చి వాయించారు.

Ap Assembly
AP Assembly: ఈలలు, చిడతలతో సభకు అంతరాయం కలిగిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. మంగళవారం శాసన మండలిలో ఈలలు వేసి గోల చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, బుధవారం అసెంబ్లీలోకి చిడతలు తీసుకొచ్చి వాయించారు. స్పీకర్ తమ్మినేని వారిస్తున్నప్పటికీ తీరు మార్చకుండా అలానే వ్యవహరించారు.
వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మాట్లాడుతోన్న సందర్భంలో చిడతలు కొడుతూ టీడీపీ సభ్యులు భజన చేశారు. వారి వైఖరిపై ఆగ్రహానికి గురైన స్పీకర్.. సభలో ఈ విధంగా వ్యవహరించడం కరెక్టేనా అంటూ స్పీకర్ మండిపడ్డారు. వారి చేతుల్లో నుంచి చిడతలు తీసుకోవాల్సింది ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బంది వాటిని తీసేసుకున్నారు.
ఆ తర్వాత చివరకు మీరంతా చంద్రబాబుకు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ మంత్రి వెలంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులను విమర్శిస్తూ.. సభకు తాగొస్తున్నారనే అనుమానం ఉందని, డ్రంక్ టెస్టు చేయాలంటూ జక్కంపూడి రాజా సూచించారు.
Read Also : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పొరపాటున గెలిచారంటూ మల్లాది విష్ణు విమర్శలకు దిగారు.