TRS : సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. మూడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమం, 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు., 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు...

Cm Kcr
KCR Birthday Celebrations : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022, ఫిబ్రవరి 17వ తేదీ 68 ఏటలో అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డేను ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జన్మదిన సంబరాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యింది. సేవా దృక్పథాన్ని చాటుకొనేలా సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. 2022, ఫిబ్రవరి 15వ తేదీ మంగళవారం నుంచి మూడురోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
Read More : JIO Internet : ఒక్క క్లిక్‌తో 3 గంటల సినిమా డౌన్‌లోడ్
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమం, 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు., 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేయాలన్నారు కేటీఆర్. పార్టీ శ్రేణులు ఎవరికి వారు తమ సేవా దృక్పథాన్ని చాటేలా ఆసుపత్రులు, వృద్థాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, పండ్లు, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అలాగే ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి 17 వరకు ఎల్బీ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగాల్లో వాలీబాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.