Ts Congress Mp Uttam Kumar Reddy Slames On State And Central Governments
Uttam Kumar Reddy : రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని టీ కాంగ్రెస్ ఎంపీ, మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల అరెస్టుల అప్రజాస్వామికం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత చర్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు.
కేంద్రం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యుల పాలిట శాపంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరితో ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం ఏర్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. మీరు అయితే రోడ్లను దిగ్బంధం చేయొచ్చు.. కానీ, మేము ధర్నాలు చేయొద్దా అని ఉత్తమ్ మండిపడ్డారు. ప్రభుత్వాల అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి బీజేపీ, టీఆర్ఎస్‌లు ఒకరిపై ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడం తమ బాధ్యత, హక్కుగా పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నుములుతూ నిరసన వ్యక్తం చేసే హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఉత్తమ్ ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షులతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ మండిపడ్డారు. ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
Read Also : Congress MP Uttam : గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ మోసగిస్తున్నాయి : ఎంపీ ఉత్తమ్