Congress MP Uttam : గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ మోసగిస్తున్నాయి : ఎంపీ ఉత్తమ్

తెలంగాణలో గిరిజనులకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను గిరిజనుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనను విమర్శించడం టీఆర్ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.

Congress MP Uttam : గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ మోసగిస్తున్నాయి : ఎంపీ ఉత్తమ్

Uttam Kumar

Congress MP Uttam Kumar : తెలంగాణ గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ మోసం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ గిరిజనులు, బీసీలు, అణగారిన వర్గాల వారిని చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. గిరిజనులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లయినా ఎందుకు గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆలస్యంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు.

తెలంగాణలో గిరిజనులకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను గిరిజనుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనను విమర్శించడం టీఆర్ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు, జీఎస్టీ, కాశ్మీర్ విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చినప్పుడు గిరిజన రిజర్వేషన్లు ఎందుకు సాదించలేక పోయారని పేర్కొన్నారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఏనాడు తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ లో గిరిజన రిజర్వేషన్ల అంశంపై స్పందించలేదన్నారు. గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు.

Uttam Kumar Reddy: ఈటలవన్నీ పిచ్చి కామెంట్లు.. కేసీఆర్ పూర్తిగా ఫెయిల్ – ఉత్తమ్ కుమార్

గిరిజనులకు రావాల్సిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వలేదని విమర్శించారు. 8 ఏళ్లలో గిరిజనులకు 1.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సివుందన్నారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయితీ తండాలో గ్రామ పంచాయితీ కార్యాలయం నిర్మించలేదని పేర్కొన్నారు. 8 ఏళ్లుగా తెలంగాణలో ఉద్యోగాల్లో, విద్యా అవకాశాల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో జనాభా ఆధారంగా రావాల్సిన రిజర్వేషన్లు రాలేదని వెల్లడించారు. ఏపీలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటై పనిచేస్తుంది..కానీ తెలంగాణలో ఇంకా యూనివర్సిటీ ఏర్పాటు కాలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా గిరిజన రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగం పేర్కొంటుందన్నారు.

ఎంపీగా రెండున్నర మూడేళ్ళుగా గిరిజన రిజర్వేషన్లపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 12శాతం గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ అసెంబ్లీ లోపల బయట అనేకసార్లు ప్రస్తావించారని చెప్పారు. కానీ కేంద్రమంత్రి మాత్రం గిరిజన రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారని తెలిపారు. అసలు విషయం తప్పుదారి పట్టించేలా హరీష్ రావు వ్యాఖలు ఉన్నాయని చెప్పారు. మార్చి21న రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని కేంద్రమంత్రి చెప్పారని పేర్కొన్నారు.

Huzurnagar : విగ్రహాలు పెట్టేదాక అన్నం ముట్టను..ఉత్తమ్ శపథం

గత డిసెంబర్ 21లోనూ ఇదే సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్ జీరో అవర్ లో, రూల్ 377 కింద గిరిజన రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించినా.. ఇదే సమాధానం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వం వల్ల ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాలేదన్నారు. ఫారెస్ట్ ల్యాండ్స్ యాక్ట్ కింద 2014 తరువాత ఒక్క సెంట్ భూమి కూడా తెలంగాణలో గిరిజనులకు ఇవ్వలేదని పేర్కొన్నారు. గిరిజనులకు భూములు ఇవ్వకపోగా ఇచ్చిన పోడు భూములు లాక్కున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన భూములే ఇచ్చారు కానీ కొత్తవి ఇవ్వలేదని పేర్కొన్నారు.