Ts Eamcet (2)
TS EAMCET: రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలుసైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్ (EAMCET) అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి (TSCHE) ప్రకటించింది.
ICF Chennai : ఐసీఎఫ్ చెన్నైలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందన ఎంసెట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. పరీక్షలు యథావిధిగా కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉన్నత విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కొంత ఊరటనిచ్చినట్లయింది. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.
#TSEAMCET Postponed! #Telangana #EAMCET pic.twitter.com/qiGU9vUWJ1
— Hi Hyderabad (@HiHyderabad) July 13, 2022
ఇదిలాఉంటే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.