ICF Chennai : ఐసీఎఫ్ చెన్నైలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ICF Chennai : ఐసీఎఫ్ చెన్నైలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

Icf Chennai

Updated On : July 13, 2022 / 1:12 PM IST

ICF Chennai : చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ICF)లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి కార్పెంటర్లు 50, ఎలక్ట్రీషియన్లు 156, ఫిట్టర్లు 143, మెషినిస్టులు 29, పెయింటర్లు 50, వెల్డర్లు 170, పాసా2 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదిగా జులై 26,2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://pb.icf.gov.in పరిశీలించగలరు.