TS High Court : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు.. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తు కీలక తీర్పు..

గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తు తీర్పునిచ్చింది.కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనం డీకే అరుణ ను ఎమ్మెల్యే గా ప్రకటించింది.

High Court Announced DK Aruna as MLA

Telangana High Court : గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (High Court) షాక్ ఇచ్చింది. గద్వాల (gadwal) ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (mla banda krishna mohan reddy)ని అనర్హుడిగా ప్రకటిస్తు తీర్పునిచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనం డీకే అరుణ (DK Aruna)ను ఎమ్మెల్యే గా ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షలు జరిమానా విధించింది.

కాగా 2018 ఎన్నియల సమయంలో బండ కృష్ణ మోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ తెలంగాణ హైకోర్టులో బీకే అరుణ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగించిన హైకోర్టు గురువారం (ఆగస్టు 24, 2023) కీలక తీర్పును వెలువరించింది. బండ కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది.

2018 ఎన్నికల్లో బండ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి డీకే అరుణపై బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. గతంలో టిడిపిలో ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు BRS లో చేరారు. అరుణ, కృష్ణమోహన్ రెడ్డి మధ్య బంధుత్వం ఉంది. 2014లో గద్వాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన డీకే అరుణ చేతిలో ఓటమిపాలయ్యారు.

దీంతో అరుణ బండ కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటు  హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ధర్మాసనం బండ కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తు గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బండ కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లతారా? లేదే వేచి చూడాలి. కాగా..ప్రస్తుతం డీకే అరుణ బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే.

 







                                    

ట్రెండింగ్ వార్తలు