TS Inter Result 2026 Date : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాలు వచ్చేది ఆరోజే.. డేట్ ఫిక్స్..
TS Inter Result 2026 Date : తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అప్డేట్. పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సర్వం సిద్ధం చేస్తోంది.
TS Inter Results
- తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్
- పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమైన ఇంటర్ బోర్డు
- ఏప్రిల్ 10 లేదా 12 తేదీల్లో ఫలితాలు వెలువడే చాన్స్
TS Inter Result 2026 Date : తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అప్డేట్. పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ దాదాపు పూర్తయింది. మార్కుల నమోదు, సాంకేతిక తనిఖీలు, ఫలితాల క్రోడీకరణ తది దశలో ఉన్నాయి. అయితే, ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్యలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 18వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,89,126 మంది విద్యార్థులు హాజరుకాగా.. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,07,949 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,47,815 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాలను ఇలా తనిఖీ చేయండి..
♦ tgbie.cgg.gov.inలోని అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
♦ హోమ్ పేజీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితం 2026పై క్లిక్ చేయండి.
♦ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
♦ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి సమ్మిట్ బటన్ను నొక్కండి.
♦ టీఎస్ ఇంటర్ ఫలితం 2026 స్క్రీన్ పై కనిపిస్తుంది.
♦ మీ మార్కులను సరిచూసుకొని.. మార్క్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
