TS High Court : మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

టీఎస్‌పీఎస్సీకి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది.

TS High Court

TSPSC group 1: టీఎస్‌పీఎస్సీకి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. తిరిగి పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ఈసారి పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.

TSPSC Group 1 Prelims : ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పరీక్షలు నిర్వహించేది ఇలానేనా? TSPSCపై హై‌కోర్టు సీరియస్

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్ లు వేశారు. హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని, పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఎస్ పీఎస్సీని ఆదేశించింది. సింగిల్ జడ్జి తీర్పును టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది.

TSPSC: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. టీఎస్‌పీ‌ఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

టీఎస్‌పీఎస్సీ అప్పీల్ పై మంగళవారం డివిజన్ బెంచ్ విచారణ చేసింది. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదని టీఎస్ పీఎస్సీని ప్రశ్నించింది. మీ నోటిఫికేషన్ లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా అంటూ డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ అంశంపై బుధవారం డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సిందేనని టీఎస్ పీఎస్సీని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు