Tirupati Special Buses : నిజామాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణకు ప్రతిరోజు వెయ్యిమందికి ఆర్టీసీ ద్వారా దర్శనం కల్పించనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సౌకర్యవంతం అన్నారు. సంస్థను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

Trc Bus
Tirupati Special Buses : తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. నిజామాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక దర్శన బస్సుల సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే భక్తులకు ఇదొక సువర్ణ అవకాశం అన్నారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి మూడు బస్సులతో పాటు దర్శనం సౌకర్యాన్ని కూడా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణకు ప్రతిరోజు వెయ్యిమందికి ఆర్టీసీ ద్వారా దర్శనం కల్పించనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సౌకర్యవంతం అన్నారు. సంస్థను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించి కాపాడుకోవాలన్నారు.
Tirumala Sri Vari Darshan : ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్ ద్వారా శ్రీవారి దర్శనం
ఇవాళ నిజామాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జెండా ఊపి ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో తిరుమల వెళ్లే భక్తులకు బస్ టికెట్‌తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్ అందిస్తారు.
తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. వారం ముందు www.tsrtconline.in నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ సేవలు మొదలైన విషయం తెలిసిందే.