Nagarjuna Sagar Car : చనిపోయినట్లు నమ్మించడానికి.. కారును సాగర్ కాలువలోకి నెట్టిన జంట

వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Twist in car incident : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారు కలకలం రేపిన విషయం తెలిసిందే. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారు ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం సమీపంలో గుర్తు తెలియని జంట కారును ఉద్దేశ్యపూర్వకంగానే కాలువలోకి నెట్టినట్లు తెలుస్తోంది. కారులో తమ లగేజ్, ఇతర వస్తువులు అన్ని ఉంచి కారును కాలువలోకి నెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

స్థానికులు ప్రశ్నించడంతో అక్కడి నుండి జంట జారుకుంది. తాము చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించడానికే ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని ప్రేమ జంటగా పోలీసులు భావిస్తున్నారు. కారు కోసం, గుర్తు తెలియని జంట కోసం గాలింపు కొనసాగుతోంది.

Sagar Canal Car : నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువలో కారు కలకలం

వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును నీటిలో నుంచి బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. స్విఫ్ట్ డిజైర్ కొత్త కారుగా కనిపిస్తోంది. కారుపై రిజస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు.

టీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంది. దాన్ని బయటికి తీసిన తర్వాత కారు ఎవరిదన్న సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.  అయితే హోలీ రోజు కావడంతో ఎవరైనా కారులో వచ్చి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కారు కాలువలోకి జారి పడిందా? లేకపోతే కారు కాలువలో పడటంతో కారును వదిలివేశారా అని మొదటగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Road Accident : కాలువలోకి దూసుకెళ్ళిన కారు.. ఇద్దరు మృతి

ఈ నేపథ్యంలో పైనున్న త్రిపురారం, నిడమనూరు మండలం, అదేవిధంగా హాలియా వరకు అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాలను అప్రమత్తం చేసి, దానికి సంబంధించిన ఘటనలు జరిగాయా అన్న కోణంలో విచారించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని జంట కారును ఉద్దేశ్యపూర్వకంగానే కాలువలోకి నెట్టినట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు