Sagar Canal Car : నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువలో కారు కలకలం

కాలువలో కొట్టుకుపోతున్న కారు.. స్విఫ్ట్ డిజైర్ కొత్త కారుగా కనిపిస్తోంది. కారుపై రిజస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. టీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంది.

Sagar Canal Car : నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువలో కారు కలకలం

Car

car washed away in left canal : నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువలో కారు కలకలం రేపింది. వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును నీటిలో నుంచి బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

కాలువలో కొట్టుకుపోతున్న కారు.. స్విఫ్ట్ డిజైర్ కొత్త కారుగా కనిపిస్తోంది. కారుపై రిజస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. టీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంది. దాన్ని బయటికి తీసిన తర్వాత కారు ఎవరిదన్న సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.

Road Accident : కాలువలోకి దూసుకెళ్ళిన కారు.. ఇద్దరు మృతి

అయితే హోలీ రోజు కావడంతో ఎవరైనా కారులో వచ్చి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కారు కాలువలోకి జారి పడిందా? లేకపోతే కారు కాలువలో పడటంతో కారును వదిలివేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పైనున్న త్రిపురారం, నిడమనూరు మండలం, అదేవిధంగా హాలియా వరకు అన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాలను అప్రమత్తం చేసి, దానికి సంబంధించిన ఘటనలు జరిగాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.