గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది.. తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్‌ రైళ్లు పరుగులు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి 600 కిలోమీటర్లు లేదా అంతకుమించి దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు ఉన్నాయి.

Vande Bharat Express

Vande Bharat Trains: తెలంగాణ నుంచి మరో రెండు వందేభారత్‌ రైళ్లు పరుగులు తీయనున్నాయి. నాంపల్లి- పుణె, చర్లపల్లి-నాందేడ్‌ మధ్య ఈ కొత్త రైళ్లు నడుస్తాయి. నాంపల్లి-పుణె మధ్య వందేభారత్‌ రైలు సర్వీసును తీసుకురావాలని ఇటీవలే ప్రతిపాదన వచ్చింది.

దానికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చర్లపల్లి-నాందేడ్‌ మధ్య కూడా వందేభారత్‌ రైలును పట్టాలు ఎక్కించడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఇప్పటికే 5 వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు మరో రెండు చేరనుండడంతో ఆ సంఖ్య ఏడుకి చేరుతుంది. (Vande Bharat Trains)

Also Read: కొంపముంచిన ట్రంప్‌.. భారత్‌లో ఆగిపోయిన చాలా మంది వివాహాలు.. హెచ్-1బీ వీసా హోల్డర్లు ఏమన్నారంటే?

ప్రస్తుతం ఉన్న వందేభారత్‌ సర్వీసులు ఇవే

  • హైదరాబాద్‌ నుంచి విశాఖకు 2
  • హైదరాబాద్‌ నుంచి తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌కు ఒక్కోటి చొప్పున

ఈ మార్గాల మధ్య ప్రయాణికులు అధికం
ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి 600 కిలోమీటర్లు లేదా అంతకుమించి దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు ఉన్నాయి. కొత్తగా మంజూరైన హైదరాబాద్‌-నాందేడ్‌ సర్వీసు మధ్య 281 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

నాందేడ్‌లోని వ్యాపారులకు తెలంగాణతో వాణిజ్య సంబంధాలు బాగా ఉంటాయి. అలాగే, హైదరాబాద్‌-నాందేడ్‌ మార్గంలో నిజామాబాద్‌ పట్టణం ఉంటుంది. దీంతో అక్కడి వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌ నుంచి పుణ్యక్షేత్రం బాసరకు కూడా చాలా మంది వెళ్తుంటారు.

కొత్తగా హైదరాబాద్‌-పుణె మధ్య కూడా వందేభారత్‌ రైలు మంజూరైంది. ఈ నగరాల మధ్య 592 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్‌లో ప్రయాణికుల రాకపోకలు కూడా బాగా ఉంటాయి.