Telangana Raj Bhavan : రాజ్ భవన్‌‌లో ఉగాది వేడుకలు, సీఎం కేసీఆర్ గైర్హాజర్.. ఫ్లెక్సీలో ప్రధాని, గవర్నర్ ఫొటోలు

తెలంగాణ రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వేడుకలకు హాజరు...

Ugadi Celebration : తెలంగాణ రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వేడుకలకు హాజరు కావాలని సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై ఆహ్వానం పంపారు. అయినా.. ఆయన హాజరు కాలేదు. మరోవైపు ఉత్సవాల ఫ్లెక్సీలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే ఉండడం గమనార్హం. ఫ్లెక్సీపై సీఎం కేసీఆర్ ఫొటో కనిపించకపోవడంపై చర్చనీయాంశమైంది. శుభకృత్ నామ సంవత్సరం ముందస్తు ఉగాది వేడుకలను సాయంత్రం నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం పంపారు. కానీ.. వారు హాజరు కాలేదు. ఎమ్మెల్యే కల్వకుంట్ల జయ్ పాల్ యాదవ్ మాత్రమే పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు.

Read More : Ugadi: శుభకృత్ నామ సంవత్సరంలో.. రాష్ట్రం సుభిక్షం కావాలి: సీఎం వైఎస్ జగన్

తెలంగాణ రాష్ట్రంలో పొలిటిక్స్ రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సీఎం – గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా ? అనే టాక్ వినిపిస్తోంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఎన్నికల క్రమంలో… కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి చేరిన సంగతి తెలిసిందే. ఈయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది. కానీ.. ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన వేడుకలకు కూడా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు దూరంగా ఉన్నారు.

Read More : Ugadi Pachadi : షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ఎలాగంటే?

సాధారణంగా ప్రభుత్వం ప్రసంగ పాఠం పంపించాల్సి ఉండగా.. అలాంటిది కూడా జరగలేదు. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాకుడా యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి కూడా గవర్నర్ ను ఆహ్వానించలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల క్రమంలో.. ప్రభుత్వానికి, రాజ్ భవన్ మధ్య విబేధాలు మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ప్రగతి భవన్ లో కూడా ఉగాది వేడుకలను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియరాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు