Ugadi: శుభకృత్ నామ సంవత్సరంలో.. రాష్ట్రం సుభిక్షం కావాలి: సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.

Ugadi: శుభకృత్ నామ సంవత్సరంలో.. రాష్ట్రం సుభిక్షం కావాలి: సీఎం వైఎస్ జగన్

Ys Jagan

Ugadi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని.. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురవాలని.. పంటలు బాగా పండి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు. సకల వృత్తుల వారూ ఆనందంగా ఉండాలని.. పల్లె పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని ప్రార్థించారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు కలకాలం వర్థిల్లాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ.. ఉగాది పండగను.. సంప్రదాయరీతిలో చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్.. పిలుపునిచ్చారు.

Read More: Ugadi Pachadi : షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ఎలాగంటే?

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభ అంటే మంగళకరం అని.. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలకు అంతా శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది బహుమతిగా.. ప్రజలకు కరెంట్ చార్జీల కష్టాలను ప్రభుత్వం ఇచ్చిందని ఆవేదన చెందారు. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఈ కష్టాల నుంచి ప్రజలు గట్టెక్కాలని అచ్చెన్న కోరుకున్నారు.

ఉగాది పండగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. అచ్చ తెలుగు పండగైన ఉగాదిని.. ఇంటిల్లిపాదీ కలిసి నిర్వహించుకోవాలన్నారు. శుభకృత్ నామ సంవత్సరం.. ప్రజలకు సర్వ శుభాలను కలగజేయాలని కోరుకున్నారు.

Read More: Ugadi 2022 : ఉగాది విశిష్టత