Rajanna Sircilla
Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలివెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. శిశువు ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి పోలీసులకు ఫోన్ చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు శిశువును స్వాధీనం చేసుకున్నారు.
చదవండి : Child Offender : వయస్సు 17, చేసిన నేరాలు 16, యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న యువకుడు…
పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాప బరువు మూడున్నర కిలోలు ఉండగా, శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పసికందును విడిచి వెళ్లినవారికోసం గాలింపు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
చదవండి : Child Raped : చాక్లెట్ ఇప్పిస్తానని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం