Do not praise your children : పిల్లల్ని పొగడొద్దు..మన పెద్దలు ఎప్పుడోచెప్పారు,ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు..ఎందుకంటే

పిల్లల్ని అతిగా పొగడొద్దు..అని మన పెద్దలు ఎప్పుడే చెప్పారు..ఇప్పుడు సైంటిస్టులు కూడా చెబుతున్నారు..ఎందుకనే విషయాలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సైంటిస్టులు.

Do not praise your children : పిల్లల్ని పొగడొద్దు..మన పెద్దలు ఎప్పుడోచెప్పారు,ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు..ఎందుకంటే

Do Not Praise Your Children Too Much

Do not praise your children too much: ‘‘నా బిడ్డ బంగారు కొండ..ఎంతబాగా చదువుతాడో..పరీక్షల్లో అన్ని ఫస్టు మార్కులే. పేద్ద డాక్టరైపోతాడు. లేదా ఇంజనీర్ అయిపోతాడు. అంటూ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మురిపెంగా పొగుడుతుంటారు. ఏదైనా విజయం సాధిస్తే తెగ పొగిడేస్తుంటారు. కానీ ఆ మాటలు వింటే మన పెద్దవాళ్లు ‘‘ఏయ్ ఏంటదీ..పిల్లల్ని అలా పొగడకూడదు ఆయుక్షీణం..దిష్టి తగులుతుంది’ అని మందలిస్తుంటారు. కానీ పెద్దలు చెప్పినదాన్ని మనం ఎప్పుడు నమ్మం.పాటించం.కానీ అదే విషయాన్ని సైంటిస్టులు చెబితే నమ్ముతాం. నిజమేనట..అంటూ దాన్ని నిర్ధారించేస్తాం. మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పినదాన్ని సైంటిస్టులు నిజమేనంటున్నారు.

పిల్లలను అతిగా ప్రశంసించడం వారి అభివృద్ధిని ప్రతికూలంగా మారుతుందని వారిలో అహంభావాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ ను పెంచుతుందని చెబుతున్నారు సైంటిస్టులు. అంతేకాదు పిల్లల్ని ఎక్కువగా పొగిడితే..పిల్లలకు ప్రాణాంతకమే కాకుండా వేధింపులకు గురయ్యేలా చేస్తుందంట. అతిగా పొగడ్తలు అందుకునే చిన్నారులు క్లిష్ట పరిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కోవడంలోను వచ్చిన సమస్యల్ని పరిష్కరించటంలోను విఫలమవుతారని చెబుతున్నారు బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం సైంటిస్టులు.

Read more : Happen after the sun dies :సూర్యుడు శక్తి తగ్గిపోతే?! అయినా ఆ గ్రహానికి ఏమీ కాదట..మరి భూమి పరిస్థితి..?!

పిల్లలను పొగిడితే జరిగే ప్రభావాలపై బ్రిటన్ ఎక్సైటర్ యూనివర్శిటీ సైంటిస్టులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయట. 4,500 మంది తల్లిదండ్రులు ఈ పరిశోధనలో పాల్గొన్నారట. యూనివర్సిటీ సోషల్ మొబిలిటీ డిపార్ట్‌మెంట్ ఎలియట్ మేజర్ ప్రకారం..సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది తల్లిదండ్రులు, తమ పిల్లలను అతిగా ప్రశంసించడం అంటే పొగడ్తలు కురిపించినందువల్లనే పిల్లలు వారు నేర్చుకోవాల్సి విషయాలను నేర్చుకోలేకపోయారని..అది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అని ఏదైనా కొత్తగా నేర్చుకోవటంపై ఈ పొగడ్తలు ప్రతికూల ప్రభావాలు చూపుతాయని తెలిపారు.

నిజానికి చిన్నారుల్లో పొగడ్త వారిలో ఉండే ప్రతిభను మరింతగా పెంచుతుంది. ఒక ప్రశంస వారిలో కాన్ఫిడెన్స్ ను మరింతగా పెంచుతుంది. అయితే, అదే సమయంలో అతిగా పొగడటం మాత్రం వారి ఎదుగుదలకు ఆటంకంగా మారుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఎదురుగా వారిని పొగిడినా..వారిని సపోర్ట్ చేస్తు ఎక్కువగా మాట్లాడినా..లేదా ప్రశంసించినా..వారిలో సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. కానీ అది వారిపై వ్యతిరేక ప్రభావాన్ని కూడా చూపుతుందనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారని అన్నారు.

Read more : Global Warming : మహా ముప్పు అంచున భూగోళం : UNO హెచ్చరిక

ఉదాయణకు 18 ఏళ్ల వయసున్న బ్రిటిష్ టెన్నిస్ స్టార్, ఇటీవల యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన ఎమ్మా రదుకను తల్లిదండ్రులు ఎక్కువగా ప్రశంసించలేదని తెలిపింది. ఇవాళ ఎమ్మా ప్రపంచంలోనే అతిపెద్ద టెన్నిస్ స్టార్‌గా నిలిచింది. అది వారి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు గానీ పొగడలేదని ఇలా కొన్ని కీలక విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలని..గుర్తించాలని..అవగాహన పెంచుకోవాలని సూచించారు.