Global Warming : మహా ముప్పు అంచున భూగోళం : UNO హెచ్చరిక

భూగోళం ప్రమాదం అంచున ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.

10TV Telugu News

Global Warming..UN Warn : ప్లాస్టిక్ వాడకం..పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులు..ఇతర కారణాలతో భూగోళం అగ్నిగోళంగా మారిపోతోందా? భూతాపం పెరిగిపోతోందా? దీంతో పెను విపత్తుముంచుకొస్తోందా? భూగ్రహం మహావిపత్తుకు అంచున ఉందా? అంటే నిజమేనంటోంది ఐక్యరాజ్యసమితి. ఈ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రతల్లో 2.7 డిగ్రీలు పెరుగే అవకాశముందని..దీంతో జీవరాశికి పెను విపత్తు ముంచుకురానుందని హెచ్చరిస్తోంది.ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరికలు వింటుంటే వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. యూఎన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ భూతాపానికి సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరుగుతాయని హెచ్చరించింది. అయితే, భూతాపాన్ని తగ్గించాలంటే ఉష్ణోగ్రతల సగటు పెరుగుదలను 1.5 డిగ్రీల లోపే ఉండేలా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు.

 

ఈ నివేదికను చూస్తుంటే భూమి మహావిపత్తు వైపు శరవేగంగా దూసుకుపోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరగడమంటే సామాన్యమైన విషయం కాదని ఇది భూమికి పెను విపత్తేనని ఆందోళన వ్యక్తంచేశారు. 1.5 డిగ్రీల దగ్గరే ఉంచుతామని ఆరేళ్ల క్రితం పారిస్ ఒప్పందం హామీ గాల్లో కలిసిపోయినట్టేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అనుకున్నలక్ష్యాన్ని అందుకోలేకపోతే భూమ్మీద జీవరాశి వినాశనానికి తప్పదని హెచ్చరించారు. భూ ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి మన దగ్గర అన్ని ఆయుధాలున్నా..దానికి తగిన సమయంలో మాత్రం లేదని..సమయం తగ్గిపోతోంది కానీ తీసుకోవాల్సిన చర్యలు మత్రం జరగటంలేదని అన్నారు.

రోజురోజుకు పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వినాశనకరమైన వాతావరణ ఘటనలకు కారణమవుతున్నాయని..ఆర్థిక వ్యవస్థలు సమాజాలపై పెరుగుతున్న ప్రభావాలతో అధిక వేడి పెరిగిపోతోందని తెలిపారు.గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వావారణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగి వేలాది హెక్టార్లలో అడవులు అగ్నికి ఆహుతి అయిపోతోందని..వరదు విరుచుకుపడి ప్రాణ, ఆస్థి నష్టాలు ఏర్పడుతున్నాయన్నారు. దీంతో ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయని యూఎన్ చీఫ్ తెలిపారు.

1970లో సంభవించిన వాతావరణ విపత్తుల కంటే ఐదు రెట్లు ఎక్కువ విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. దీని వల్ల ఏడు రెట్లు నష్టాలు జరుగుతున్నాయన్నారు. అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయని న్యూయార్క్ నగరంలో వరదలతో అల్లాకల్లోలం అయిపోగా 50మంది చనిపోయారని ఇది వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కారణమేనని అన్నారు.

Read more : Cyclone Tauktae: తౌక్తా తుఫాను.. రెండు రాష్ట్రాలకు వరద ముప్పు.. విమానాలపై ప్రభావం

ఈ విపత్తులు ఇలాకే కొనసాగితే భవిష్యత్తు అంధకారమైపోతుందని హెచ్చరించారు.గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1 ° C ఉంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉంది తాత్కాలికంగా 1.5 ° సెల్సియస్ గా నమోదు అయ్యిందని..ఇది నిబంనల ఉల్లంఘనల ఫలితమేనని అన్నారు. రాబోయే ఐదేళ్లలో పారిశ్రామిక రంగంలో వచ్చే మార్పులతో గ్లోబల్ వార్మింగ్ మరింతగా పెరిగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. వరదలు పెరుగుతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల ద్వీపాల్లో నివసించేవారికి పెను ప్రమాదంగా మారుతున్నాయని అలాగే..సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేవారికి కూడా ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. జరుగుతున్న నష్టాన్ని తక్షణమే నివారించకపోతే తీసుకోవాల్సిన చ్యలు తీసుకోకపోతే..కోలుకోలేనంత నష్టా తప్పదని..కానీ ఇప్పటికే సమయం మించిపోయింది. ఇక సమయం లేదు. నష్టాన్ని నివారించటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పదే పదే ఆందోళనతో హెచ్చరించారు.

 

 

10TV Telugu News