Happen after the sun dies :సూర్యుడు శక్తి తగ్గిపోతే?! అయినా ఆ గ్రహానికి ఏమీ కాదట..మరి భూమి పరిస్థితి..?!

సూర్యుడు శక్తి కోల్పోతే ఈ భూమి పరిస్థితి ఏంటీ? ఇక్కడ నివసించే జీవరాశులు పరిస్థితి ఏంటీ? సౌర వ్యవస్థలో ఏయే గ్రహాలు మనుగడ సాగిస్తాయి? అనే విషయంపై సైంటిస్టులు ఆసక్తిక విషయాలు...

Happen after the sun dies :సూర్యుడు శక్తి తగ్గిపోతే?! అయినా ఆ గ్రహానికి ఏమీ కాదట..మరి భూమి పరిస్థితి..?!

Happen After The Sun Dies

What will happen after the sun dies : ఈ భూమ్మీద నివసించే మానవ జాతి నుంచి పశుపక్ష్యాల వంటి సమస్త జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి అంటే దానికి కారణం సూర్యుడు. సూర్యరశ్మి ఆధారంగా మనుగడ సాధిస్తున్నాయి. అటువంటి సూర్యుడే లేకపోతే..మరి ఈ జీవరాశుల మనుగడ ఎలా?సూర్యుడు శక్తి కోల్పోతే ఈ భూమి పరిస్థితి ఏంటీ? ఇక్కడ నివసించే జీవరాశులు పరిస్థితి ఏంటీ? సౌర వ్యవస్థలో ఏయే గ్రహాలు మనుగడ సాగిస్తాయి? అనేది పెద్ద ప్రశ్న అనే చెప్పాలి. సూర్యగ్రహం గ్రహాల గమనాన్ని నియంత్రించే కేంద్రకంగానూ సూర్యగోళం పాత్ర ఎంతో ప్రధానమైనది. అత్యంత కీలకమైనది. శక్తివంతమైనది కూడా. ఇంతటి కీలకంగా ఉన్న సూర్యుడు ఉన్నట్టుండి ప్రకాశించే గుణాన్ని కోల్పోతే? తన శక్తిని కోల్పోతే? భూమి మీద జీవరాశులు ఏమవుతాయి? సౌరకుటుంబంలో ఇతర గ్రహాల పరిస్థితి ఏమిటి? అనే అత్యంత ప్రధానమైన, కీలకమైన ప్రశ్నలకు ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టాస్మెనియా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.

భూమి పరిస్థితి ఏమిటి?
మిగతా గ్రహాల పరిస్థితి గురించి తరువాత చెప్పుకోవచ్చు గానీ..ఈ భూమ్మీద నివసించే మనుషులుగా సూర్యుడు శక్తిని కోల్పోతే భూమి పరిస్థితి ఏంటీ? మన మనుగడే కాకుండా ఈ భూమ్మీద నివసించే సమస్త జీవరాశులు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలా? అనే ప్రశ్నలకు పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు. సూర్యుడు లేకపోతే భూమి చీకటిమయం అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి చెట్లు, మనుషులు, జీవజాలమంతా నశిస్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ వేల డిగ్రీల సెంటీగ్రేడ్‌ కిందకు వెళ్తాయి. భూమి గురుత్వాకర్షణశక్తి, భ్రమణ వేగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే వచ్చే 500 కోట్ల ఏళ్ల వరకూ సూర్యుడు అంతరించే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు.

మనుగడ సాగించేది ఆ గ్రహమే..
సూర్యుడు ఉన్నట్టుండి మృత నక్షత్రంగా మారిపోతే సౌరకుటుంబంలో అన్ని గ్రహాలు నిర్జీవంగా మారి.. నాశనమవుతాయి. దాదాపు ఐదు బిలియన్ సంవత్సరాలలో మన సూర్యుడు శక్తి కోల్పోయి..తెల్లగా మారిపోయి మరుగుజ్జు దశకు చేరుకుంటే.. అటువంటి పరిస్థితిలో కూడా బృహస్పతి (Jupiter) గ్రహం మాత్రం మనుగడలోనే ఉంటుందట. అంటే తన ఉనికిని చాటుకుంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే భూమి మాత్రం అంతకు ముందు చోటుచేసుకొనే ‘రెడ్ జెయింట్’ దశలోనే విచ్ఛిన్నమవుతుందని గుర్తించారు. భూమి నుంచి 6,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహ వ్యవస్థను పరిశీలించి ఈ కొత్త విషయాలను కనుగొన్నారు.

దీని గురించి టాస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన పరిశోధకులు డాక్టర్ జాషువా బ్లాక్‌మన్ మాట్లాడుతు..”సౌర వ్యవస్థలో సూర్యుడికి సుదూరంలో తిరుగుతున్న గ్రహాలు మాత్రమే.. సూర్యుడు తెల్లని మరుగుజ్జు దశకు చేరుకున్న తరువాత కూడా మనుగడ సాగించగలవని..మా పరిశోధనలో తేలిందని వెల్లడించారు. సూర్యుడి నుంచి బృహస్పతికి ఉన్న సగటు దూరం, అక్కడి వాతావరణం, నేల స్వభావం, గురుత్వాకర్షణ, భ్రమణ-పరిభ్రమణ వేగాలు దీనిపై ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తెలిపారు.