బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన కిషన్ రెడ్డి.. భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Coal Mine Auction : వెస్ట్ ఇన్ హోటల్ లో 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. వేలంపాటను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాం, బిడ్డర్లు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్ లను వేలానికి కేంద్రం ఉంచింది. వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్ మైన్ కూడా ఒకటి. శ్రావణపల్లి కోల్ మైన్ లో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గతంలో గుర్తించారు. సింగరేణి సంస్థకే నేరుగా శ్రవణపల్లి బ్లాక్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ చేస్తుంది. అయితే, వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొంటోందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read : ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం అంటూ..

తెలంగాణలోని శ్రావణ పల్లి బ్లాక్ ను నేరుగా సింగరేణికి ఇవ్వాలని కోరిన భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం తరుపున భట్టి రిప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరం. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామని అన్నారు. ప్రధాని మోదీ సమయం తీసుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళతామని చెప్పారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయంచేసే బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందని భట్టి అన్నారు.

Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాక్యలు

తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరం. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని భట్టి అన్నారు. ఇందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని, గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్ లకు సింగరేణికే కేటాయించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందని భట్టి విమర్శించారు. సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల సంస్థ.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ గనులను సింగరేణికు కేటాయించవచ్చునని భట్టి అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు