ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం అంటూ..

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లను ఆయన బయటపెట్టారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం అంటూ..

Danam Nagender: రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ, వారి పేర్లు కూడా బయటపెట్టారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయని, దీంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిన నేపథ్యంలో దానం నాగేందర్ స్పందించారు.

హారీశ్ రావు పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కొత్త ప్రభాకర్, కేవీ వివేకానంద, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే హస్తం పార్టీలోకి వస్తారని దానం నాగేందర్ అన్నారు.

Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు