Upasana Kamineni
Upasana Kamineni : మెగా కోడలు ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. అనేక మూగజీవాలను దత్తత తీసుకున్నారు. అంతేకాదు ప్రజలకు పౌష్ఠిక ఆహారం, ఆరోగ్య నియమాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఉపాసన షేర్ చేసే వీడియోలు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. మనుషులకే కాదు మూగ జీవాలకు సాయం చేయడంలో కూడా ఉపాసన ముందుటారు.
చదవండి : Upasana : సోదరి పెళ్లి వేడుకల్లో ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన
తాజాగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. జూలోని జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు జూను పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న సిబ్బందిని ఆమె ప్రశంశించారు.
చదవండి : Upasana: నేనూ మనిషినే కదా? నాకూ జెలస్ ఉంటుంది.. మెగా కోడలు ఉపాసన కామెంట్స్!