Upasana: నేనూ మనిషినే కదా? నాకూ జెలస్ ఉంటుంది.. మెగా కోడలు ఉపాసన కామెంట్స్!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌.. ఉపాసనల పెళ్లై ఎనిమిదేళ్లయింది. ఇప్పటివరకు పిల్లలను ప్లాన్‌ చేసుకోలేదు ఈ జంట.

Upasana: నేనూ మనిషినే కదా? నాకూ జెలస్ ఉంటుంది.. మెగా కోడలు ఉపాసన కామెంట్స్!

Ramcharan

Updated On : November 12, 2021 / 9:22 AM IST

Upasana: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌.. ఉపాసనల పెళ్లై ఎనిమిదేళ్లయింది. ఇప్పటివరకు పిల్లలను ప్లాన్‌ చేసుకోలేదు ఈ జంట. ఎప్పుడూ కూడా అభిమానులు వీరి నుంచి గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా జూనియర్‌ రామ్‌చరణ్‌ను గానీ, జూనియర్‌ ఉపాసనను గానీ ఎప్పుడు చూపిస్తారు? అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.

లేటెస్ట్‌గా ఓ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఒకింత సీరియస్ అయింది. తన వ్యక్తిగత విషయమని ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ఎక్కువచేసి చూపిస్తుందని, వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకులేదు. ఎవరేమైనా అనుకోని.. నేను మాత్రం దీనికి సమాధానం చెప్పను. ఆ టైం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ అందరికీ చెబుతానన్నారు.

Nokia X100: నోకియా 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. బడ్జెట్‌ ధరలోనే అందుబాటులోకి!

ఇక చరణ్ చేసిన సినిమాల్లో రంగస్థలం, చిరంజీవి నటించినవాటిలో సైరా సరసింహారెడ్డి సినిమాలు తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తన భర్త చరణ్‌.. సెట్స్‌పై హీరోయిన్‌లతో క్లోజ్‍‌గా ఉంటే జెలస్‌గా అనిపిస్తుందా? అని యాంకర్ ప్రశ్నించగా.. యస్.. నేనూ మనిషినే కదా? నాకూ జెలస్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

Puneeth Rajkumar : పునీత్ కోసం అభిమాని ఆత్మహత్య.. కుటుంబాన్ని పరామర్శించిన పునీత్ సోదరుడు

నాకు ఇవన్నీ తెలియదు.. నేను డిఫరెంట్ వరల్డ్ నుంచి వచ్చాను.. ఫీమేల్ స్టార్స్‌తో సెట్స్‌పై చూసినప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు.. అంటే నాకు లవ్ లేనట్లేనని, మా అత్తయ్య ఇటువంంటి విషయాల్లో నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. చరణ్ కూడా ఆ విషయంలో చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది.