MLA Ganesh Congratulated Children : ఒకరి బరువును మరొకరు మోస్తూ సీఎం కేసీఆర్ ను చూసిన చిన్నారులు..అభినందించిన ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా

నిజామాబాద్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎంతో ప్రయాసపడిన చిన్నారులను అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా తన క్యాంపు కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు.

MLA Ganesh Congratulated Children : నిజామాబాద్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎంతో ప్రయాసపడిన చిన్నారులను అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా తన క్యాంపు కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు. నూతన కలెక్టరేట్‌, TRS పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ రాగా.. కేసీఆర్‌ను చూసేందుకు ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఏడేళ్ల దేవ్, 5 సంవత్సరాల గోలు గోడపై నుంచి ఒకరి తరువాత ఒకరు బరువును మోస్తూ చూసి ఆనందించారు. ఈ ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వారి ఉత్సాహాన్ని చూసి ముచ్చట పడిన ఎమ్మెల్యే గణేష్ గుప్తా బిగాల తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని చిన్నారులను అభినందించారు.

 

సోమవారం (సెప్టెంబర్5, 2022)న నిజామాబాద్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్.. నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని, అనంతరం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచే పోరాటాన్ని షురూ చేయాలని పిలుపునిచ్చారు. 2024లో బీజేపీ ముఖ్త్ భారత్ నినాదంతో రైతాంగం నడవాలని చెప్పారు.

Lok Sabha elections 2024: ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే.. తెలంగాణ నుంచే పోరాటం షురూ: సీఎం కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో నాన్ బీజేపీ జెండా ఎగరబోతుందని కేసీఆర్ అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దాని పర్యవసానంగా సాగు కూడా భారంగా మారిందని అన్నారు. కేంద్ర సర్కారు ఎన్పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిందని, రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వద్దని ప్రధాని మోదీ అంటున్నారని చెప్పారు.మనచుట్టూ జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. 60 ఏళ్ళు పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు