Urea in Lucky Draw
Urea in Lucky Draw : తెలంగాణ వ్యాప్తంగా రైతులను యూరియా కొరత వేధిస్తోంది. యూరియాను దక్కించుకునేందుకు గత కొన్ని రోజులుగా రైతులు పడరాని పాట్లు పాడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘం భవనాల వద్ద, పలు ప్రాంతాల్లో యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్ది లైన్లో నిలబడినా కేవలం ఒక్క యూరియా బస్తా మాత్రమే దొరుకుతుండడంతో రైతుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగుచేసిన పంటలకు యూరియాను అందించేందుకు రైతులు యూరియా బస్తాలకోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఏ జిల్లాల్లో చూసినా యూరియా కోసం భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని రైతులు యూరియాకోసం మంగళవారం ఉదయం పీఏసీఎస్ వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోవడంతో శ్వాస ఆడక ముగ్గురు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. యూరియాకు ఏర్పడిన డిమాండ్ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని ఓ దుర్గా దేవి మండపం నిర్వాహకులు విచిత్రమైన ఆలోచన చేశారు. లక్కీడ్రాలో బహుమతులుగా యూరియా బస్తాలను కూడా చేర్చారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాంలింగంపల్లి వెదురుగట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి మండపం నిర్వాహకులు లక్రీడా నిర్వహించారు. ఈ లక్కీడ్రా కింద నాలుగు యూరియా బస్తాలు ఫ్రైజ్ గా పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం యూనియా బస్తాల కొరత ఉండడంతో నిర్వాహకులు డిఫరెంట్ గా ఆలోచించారు. రూ.50 కూపన్ కు ఫస్ట్ ఫ్రైజ్ కింద తైవాన్ స్ప్రేయర్, సెకండ్ ఫ్రైజ్ కింద చార్జింగ్ స్ప్రేయర్, థర్డ్ ఫైజ్ కింద నాలుగు యూరియా బస్తాలు అందిస్తామని ప్రకటించారు. గ్రామంలో ప్రకటించిన బహుమతి భిన్నంగా ఉండడంతో డ్రా కూపన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.