Hyd Police : రాత్రి కలగంటాడు.. పగలు కొట్టేస్తాడు, 30 ఏళ్లుగా దొంగతనాలు

ఉదయం పనికి వెళతాడు. మధ్యాహ్నం ఓ కునుకేస్తాడు. ఎక్కడ దొంగతనం చేయాలో అందులో తెలుస్తుందట. దొంగతనం చేయాల్సిన ప్రాంతం డిసైడ్‌కాగానే అక్కడికి వెళ్లిపోతాడు. రెక్కీ నిర్వహించి తాళం వేసిన..

Variety Thief : ఓ దొంగ మిట్టమధ్యాహ్నం పూట ఓ కునుకేస్తాడు. వెంటనే ఓ కల వస్తుంది. ఎక్కడ దొంగతనం చేయాలో తెలుస్తుంది. అంతే రాత్రికి రంగంలోకి దిగుతాడు. దోచేస్తాడు. 30ఏళ్లుగా దర్జాగా హైదారాబాద్‌లో చోరీలు చేస్తున్న మచ్చు అంబేద్కర్‌ అనే ఓ దొంగ పోలీసులకు దొరికాడు. సార్‌ దొంగతనాలు చేసే స్టైల్‌ చూసి పోలీసులకు మైండ్‌బ్లాంక్ అయ్యింది. చోరీలు చేయడం, చేసిన సొత్తు దాయడం అంతా వెరైటీనే… హైదరాబాద్‌ పోలీసులు వనస్థలిపురంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు పోలీసులు అనుమానంతో పట్టుకుని తమదైన స్టైల్‌లో విచారించారు. దీంతో చిట్టా బయటకొచ్చింది. ఇతను ఇందిరాపార్క్‌ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.

Read More : Extra Marital Affair : వివాహేతర సంబంధం తెలిసిపోయిందని యువకుడు ఆత్మహత్య

ఉదయం పనికి వెళతాడు. మధ్యాహ్నం ఓ కునుకేస్తాడు. ఎక్కడ దొంగతనం చేయాలో అందులో తెలుస్తుందట. దొంగతనం చేయాల్సిన ప్రాంతం డిసైడ్‌కాగానే అక్కడికి వెళ్లిపోతాడు. రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇంటిని ఎంచుకుంటాడు. అర్థరాత్రి పనిలోకి దిగి పని కానిచ్చేస్తాడు. ఇంటితాళం తీయడం లేదా ఇనుప గ్రిల్స్‌ను తొలగించడంలో నేర్పరి. బంగారం, వెండి, డబ్బు ఎంత దొరికితే అంత నొక్కేసి క్షణాల్లో మాయమవుతాడు. మళ్లీ మామూలే… ఇతడిపై మొత్తం 43 చోరీ కేసులున్నాయి. ఇతడి దగ్గర కోటీ 30లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీ చేసిన సొత్తును ఎక్కడా అమ్మడు.

Read More : Madhya Pradesh : మైనర్ బాలికపై అత్యాచారం-మహంతు, అనుచరుడి ఇళ్లు నేల మట్టం

దాన్ని భద్రంగా కాగితాల్లో చుట్టి ఇంట్లో భద్రంగా దాచేవాడు. ఇన్నేళ్లలో చోరీ చేసిన దాంట్లో నగదు మాత్రమే ఖర్చు పెట్టాడు. మిగిలినదంతా అలాగే ఉంచాడు. అంబేద్కర్‌ అలియాస్‌ రాజు అలియాస్‌ ప్రసాద్ లైఫ్‌ స్టైల్‌ విచిత్రంగా ఉంటుంది. హైదరాబాద్‌లో పగలు పని చేసుకుంటూ రాత్రిళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకునేవాడు. కానీ ఇతనికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మూడంతస్తుల భవనం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇతను హైదరాబాద్‌లో ఆ చివర్నుంచి ఈ చివరి వరకు అన్ని ఏరియాలను కవర్ చేశాడు. 30ఏళ్ల పాటు దొరక్కుండా దొంగతనాలు చేశాడు. చివరకు తాను ఎక్కడైతే ఎక్కువ దొంగతనాలు చేశాడో అదే వనస్థలిపురంలో పోలీసులకు చిక్కాడు.

ట్రెండింగ్ వార్తలు