Madhya Pradesh : మైనర్ బాలికపై అత్యాచారం-మహంతు, అనుచరుడి ఇళ్లు నేల మట్టం

మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా నేర చరితులపై చర్యలు తీసుకునే క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది. మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లాలో స్వయం ప్రకటిత దేవుడిగా చెప్పుకున

Madhya Pradesh : మైనర్ బాలికపై అత్యాచారం-మహంతు, అనుచరుడి ఇళ్లు నేల మట్టం

Madhya Pradesh Sadhu Santhu

Madhya Pradesh :  మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా నేర చరితులపై చర్యలు తీసుకునే క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది. మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లాలో స్వయం ప్రకటిత దేవుడిగా చెప్పుకునే మహంత్ సీతారామ్ దాస్, అలియాస్ సమర్థ్ త్రిపాఠీ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయటంతో ప్రభుత్వం బుల్ డోజర్లతో త్రిపాఠీ ఇంటిని అతడి అనుచరుడి ఇంటిని కూల్చి వేసింది. మత పరమైన ప్రసంగాలు చేసే సీతారాం దాస్ ను పోలీసులు మార్చి 30 న అరెస్ట్ చేశారు. గురువారం మార్చి 31న దాస్ ఇంటిని కూల్చివేశారు. దాస్ సహచరుడు వినోద్ పాండే ఇంటిని కూడా అధికారులు కూల్చివేశారు.

వివరాల్లోకి వెళితే …..మార్చి 28న సీతారాం దాస్ అనుచరులు సత్నా కు   చెందిన బాలికకు మాయమాటలు చెప్పి రేవా సర్క్యూట్ హౌసుకు తీసుకువచ్చారు. అక్కడ వారు ఆమెతో బలవంతంగా మద్యంతాగించారు. అనంతరం ఆమెను సర్క్యూట్ హౌస్ లో విడిది చేసిన  సీతారాం దాస్ గదిలోకి పంపగా అక్కడ ఆమె అత్యాచారానికి గురయ్యింది. బాలికను రేవా నుంచి తిరిగి సత్నా తీసుకువెళుతూ ఉండగా మార్చి 29న ఆమె కారు దూకి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది.

దీంతో పోలీసులు మార్చి 30న సీతారాం దాస్‌ను అరెస్ట్ చేశారు. దాస్ ప్రధాన అనుచరుడు రౌడీ షీటర్ వినోద్ పాండే పేరుతో రూమ్ బుక్ చేసి ఉండటంతో అతడ్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.  ఆ నిందితులిద్దరూ మోను, ధీరేంద్ర మిశ్రాలు.. ఇద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా బాలికపై అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.
Also Read : Swiggy Boy: ప్రేమికుల మధ్య గొడవ: పరిష్కరించడానికి వెళ్లి యువతిని కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్
రేవాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అక్రమార్కుల ఆస్తులను బుల్డోజర్‌తో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. సీఎం చెప్పినట్లుగా అధికారులు గర్హ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుద్వా గ్రామంలో ఉన్న సీతారాం దాస్‌ ఇంటితోపాటు గార్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోరి గ్రామంలో ఉన్న అనుచరుడు వినోద్ పాండే ఇంటిని కూడా జేసీబీతో గురువారం ధ్వంసం చేసినట్లు రేవా జిల్లా కలెక్టర్ మనోజ్ పుష్ప్ చెప్పారు.