Assembly Elections 2023: ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యేతో పాటు కీలక నేతలు రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

Venepalli Chander Rao

BRS: తెలంగాణ ఎన్నికల వేళ కోదాడలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ముగ్గురు ఎంపీపీలు, ముగ్గురు జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట రత్నం బాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాండు రంగారావు, సర్పంచులు, తదితరులు రాజీనామాలు చేశారు.

తామంతా కలిసి కోదాడ బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ను ఈ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని వేనేపల్లి చందర్రావు చెప్పారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో తాము ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

సొంత పార్టీ నాయకులపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం దారుణమని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ అధిష్ఠానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. కోదాడలోని కీలక నేతలను ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. కాగా, బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Nara Bhuvaneswari : నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర : నారా లోకేశ్