rare snake found in nallamala forest : నల్లమల అడవులు. ఎన్నో జీవజాతులకు ఆలవాలం. మరెన్నో వన్యప్రాణులకు ఆవాసంగా నల్లమల అడవులు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని ఇంకెన్నో ప్రాణులకు ఆవాసంగా ఉంది నల్లమల అటవీ ప్రాంతం.ఈ క్రమంలో తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట రేంజ్ పరిధిలోని గుండం పరిసరాల్లో అరుదైన జాతికి చెందిన పాము అటవీశాఖ అధికారుల కంటపడింది.
దక్షిణ భారతదేశంలో ఈ పామును షీల్డ్ టైల్ స్నేక్ అనే పేరుతో పిలుస్తారని అటవీశాఖ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. యూరో ఫెల్డీటే కుటుంబానికి చెందిన యూరోఫెల్డ్సీ ఎల్‌ఏటీ శాస్త్రీయనామం పాముగా గుర్తించినట్లు తెలిపారు.
పాముల ప్రత్యేక అధికారి సదాశివయ్య ఈ పాముపై ప్రత్యేక పరిశోధనలు చేసి అరుదైన జాతుల్లో ఒకటిగా గుర్తించారని తెలిపారు. ఇది సుమారు 25 సెంటీమీటర్ల పొడవు ఉండి భూమి బొరియల్లో నివసిస్తాయని..ఆహారం కోసం కేవలం రాత్రి వేళల్లోనే మాత్రమే బైటకొస్తాయని తెలిపారు. ఈ జాతి పాము నల్లమలలో ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా చెప్పుకోవచ్ అని ఆయన తెలిపారు.
నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఒక భాగంగా విలసిల్లుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో(మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప, కొద్ది మేర నల్గొండ జిల్లాలలో) విస్తరించి ఉన్నాయి. నల్లమల కొండల సరాసరి ఎత్తు 520 మీ వీటిలో 923 మీ ఎత్తుతో బైరానీ కొండ, 903 మీటర్ల ఎత్తుతో గుండ్ల బ్రహ్మేశ్వరం కొండ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఈ అడవుల్లో పులులు సమృద్దిగా ఉండటం వలన ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది మన దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణాకేంద్రంగా విలసిల్లుతోంది. నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతిపరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి..అత్యంత దట్టమైన అడవులు ఈ నల్లమల అడవులు..