Medigadda Barrage Representative Image (Image Credit To Original Source)
Medigadda Barrage: మేడిగడ్డ డ్యామ్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్ ల జాబితాలో మేడిగడ్డ డ్యామ్ ఉన్నట్లుగా కేంద్రం ప్రకటించింది. దుర్బలత్వంలో మొదటి క్యాటగిరీలో ఉన్న ప్రాజెక్ట్ మేడిగడ్డ అని కేంద్రం తెలిపింది. ఫస్ట్ కేటగిరీ డ్యామ్స్ లో తీవ్ర లోపాలను కనుక సరిచేయకపోతే డ్యామ్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్లుగా కేంద్ర బృందం చెప్పింది.
2025 వర్షాకాలం అనంతరం నిర్వహించిన తనిఖీల ఆధారంగా మేడిగడ్డను మొదటి కేటగిరీ ప్రాజెక్టుల్లో కేంద్రం చేర్చింది. దేశవ్యాప్తంగా డ్యామ్ ల స్థితిగతులపై ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అందులో భాగంగా మేడిగడ్డను ఫస్ట్ కేటగిరీలో ఉంచింది. దేశంలోని మొత్తం డ్యామ్ లను మూడు క్యాటగిరీలుగా విభజన చేసింది. మొదటి కేటగిరీలో అత్యంత దుర్బల స్థితిలో ఉన్న డ్యామ్ లు ఉండగా అందులో మేడిగడ్డ ఒకటిగా ఉన్నట్లు చెప్పింది.
Also Read: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కసరత్తు స్పీడప్.. ఆ నెలలో పార్టీపై ప్రకటన? తర్వాత పాదయాత్ర..!?