Chiranjeevi Politics : రాజకీయాలను వదిలి చిరంజీవి మంచి పని చేశారు

రాజకీయాలను వదిలి సినీ నటుడు చిరంజీవి మంచి పని చేశారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Vice President Venkaiah Naidu : రాజకీయాలను వదిలి సినీ నటుడు చిరంజీవి మంచి పని చేశారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం ఇప్పుడు అంతబాగా లేదని, రాజకీయాల కోసం ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదని వెల్లడించారు. రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవిలు పాల్గొన్నారు. ముందుగా మాట్లాడిన చిరంజీవి…వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనికి వెంకయ్య నాయుడు స్పందించారు.

Read More : Chiranjeevi : వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలి – చిరంజీవి హాట్ కామెంట్స్

తనకు రాష్ట్రపతి పదవి వస్తుందో..రాదో తెలియదని, ఇప్పుడున్న పొలిటిక్స్ అంతబాగా లేవన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా మెడికల్ టూరిజం హబ్ గా ఎదుగుతోందని, అంతర్జాతీయ ప్రమాణాలకు  అనుగుణంగా మంచి డయోగ్నస్టిక్స్ సెంటర్ లున్నాయని తెలిపారు. ఇంకా చాలా మంది అజ్ఞానంతో కరోనా వాక్సిన్ వేసు కాలేదని, కరోనా వాక్సిన్ వేసుకుంటే దాని ప్రభావం తగ్గుతుందని సూచించారు. ప్రధాన మంత్రి మోదీ కోసం కాదని, ఆరోగ్యం కోసం వాక్సిన్ వేసుకోవాలన్నారు. దేశంలోనే తక్కువ టైంలో వ్యాక్సిన్ డ్రైవ్ గొప్పగా జరిగిందని మెచ్చుకున్నారు. కరోనా వారియర్స్ లో ముందు వరుసలో వైద్య సిబ్బంది ఉన్నారని, మన సైంటిస్ట్ లు మొదట వాక్సిన్ కనుక్కోవడం గొప్ప విషయమన్నారు.

Read More : Tipu Sultan Throne Auction: భార‌త్ నుంచి దోచుకుపోయిన టిప్పు సుల్తాన్ సింహాస‌నంలో పులి తలను వేలానికి పెట్టిన బ్రిటన్..

వైద్య రంగంలో పరిశోధనలు పెరగాలని, కరోనా కారణంగా..అన్ని రంగాలు దెబ్బతిన్నా యన్నారు. కరోనా కాలంలో కూడా రైతులు కష్టపడటం ద్వారా ఆహార ఉత్పత్తులు 4.5 శాతం పెరిగినట్లు..ఇదొక గర్వకారణం అని అభివర్ణించారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని, పశ్చాత్య మోజులో పడి పిజ్జా, బర్గర్ లకు అలవాటుపడి ఆరోగ్యం దెబ్బతీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సంప్రదాయ వంటలనే తినడం, వ్యాయామం పై అవగాహన పెంచుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు