Tipu Sultan Throne Auction: భార‌త్ నుంచి దోచుకుపోయిన టిప్పు సుల్తాన్ సింహాస‌నంలో పులి తలను వేలానికి పెట్టిన బ్రిటన్..

భార‌త్ నుంచి దోచుకుపోయిన టిప్పు సుల్తాన్ సింహాసనంలో 8వ పులిని వేలానికి పెట్టింది బ్రిటన్.

Tipu Sultan Throne  Auction: భార‌త్ నుంచి దోచుకుపోయిన టిప్పు సుల్తాన్ సింహాస‌నంలో పులి తలను వేలానికి పెట్టిన బ్రిటన్..

Tipu Sultan Throne Auction

Tipu Sultan Throne Auction : భారత్ ను 200ల ఏళ్లపాటు పాలించిన బ్రిటీష్ వారు ఎంతో సంపదను తరలించుకుపోయారు. ఈక్రమంలో 8వ శతాబ్దంలో భారతదేశంలో మైసూరు చక్రవర్తి టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని కూడా బ్రిటన్ దొంగిలించుకుపోయింది. “టైగర్ ఆఫ్ మైసూర్” అని కూడా పిలువబడే టిప్పు సుల్తాన్ సింహాసనంలో ఎనిమిది బంగారు పులి తలలు ఉన్నాయి. ఈ ఎనిమిది పులి తలల బొమ్మలు బంగారంతో చేసినవే. ఈ తలలకు కెంపులు, పచ్చలు, వజ్రాలు, వైఢూర్యాలు  పొదగబడి ఉన్నాయి. మైసూర్ టైగ‌ర్ టిప్పు సుల్తాన్ వాడిన సింహాస‌నం గురించి అప్ప‌ట్లో గొప్ప‌లు చెప్పుకునేవారు.

Read more : Antique Spectacles: ఈ కళ్లద్దాల ఖరీదు రూ.25 కోట్లు

బ్రిటీష్ వారి చేతుల్లో టిప్పు సుల్తాన్ ఓట‌మి త‌ర్వాత బ్రిటీష్ ఆ సింహాసనాన్ని తరలించుకుపోయింది. తరలించుకుపోయింది అనేకంటే దొంగిలించుకుపోయింది అనటం సరైనది. ఆ సింహాసనాన్ని ముక్క‌లు చేసింది. ఆ సింహాస‌నంలో ఉన్న 8 బంగారు పులుల త‌లల్లో ఇప్పుడు వేలానికి పెట్టినది ఓ పులితల ఒకటి. ఆ పులి తల ధ‌ర‌ను 1.5 మిలియ‌న్ పౌండ్లుగా  అంటే మ‌న క‌రెన్సీలో సుమారు రూ. 15 కోట్ల రూపాయ‌లుగా నిర్ణ‌యించింది. కాగా..ఈ సింహాసనం గురించి 2009 వరకు ప్రపంచానికి తెలియదు. ఈ సింహాసనం 18వ శతాబ్దపు దక్షిణ భారత స్వర్ణకారుల కళా నైపుణ్యానికి ఇది చిహ్నంగా నిలిచింది. అలాగే ఈ సింహాసనంలో ఉన్న బంగారు శాసనం ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. టిప్పు సుల్తాన్ 1799లో ఓడిపోయి మరణించే వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓ రేంజ్ లో హడలెత్తించారు.

అయితే టిప్పు సుల్తాన్ సింహాసనం యూకే దాటిపోయే ప్రమాదం ఉందని.. కనుక దీన్ని కొనాలని అనుకునేవారు కమిటీ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన 0845 300 6200 నంబరుకు కాల్ చేయాలని బ్రిటన్ ప్రభుత్వ డిజిటల్, సంస్కృతి, మీడియా, క్రీడల శాఖ సోషల్ మీడియా వేదికగా కోరుతుంది.దీన్ని Throne Finial పేరుతో టిప్పు సింహాస‌నాన్ని ఇంగ్లండ్ వేలం వేయ‌గా.. దాన్ని వేలంలో వ‌చ్చే సంవ‌త్స‌రం జూన్ వ‌ర‌కు ఉంచ‌నున్నారు. దాన్ని ఎగుమ‌తి చేసుకునే వెసులుబాటు లేకుండా తాత్కాలికంగా దాన్ని బ్యాన్ చేస్తున్న‌ట్టు యూకే వెల్ల‌డించింది.

Read more : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ వేలం గురించి యూకే ఆర్ట్స్ మినిస్టర్ లార్డ్ స్టీఫెన్ పార్కిన్సన్ స్పందిస్తూ.. ఆ సింహాస‌నం.. యూకే దాటి వెళ్లే ప్ర‌మాదం ఉంది.. అందుకే దానిపై తాత్కాలికంగా ఎగుమతిపై బ్యాన్ విధించాం. దాన్ని యూకేకు చెందిన వాళ్లే ద‌క్కించుకుంటార‌ని ఆశిస్తున్నాం అని తెలిపింది. టిప్పు సుల్తాన్​ సింహాసనానికి వేలానికి భారీ రెస్పాన్స్​ వస్తుందని అన్నారు. అంతేకాదు భారతదేశంలో బ్రిటీషర్ల భాగస్వామ్య పాలన గురించి ఈ తరానికి తెలియజేయటమే తమ ఉద్దేశ్యమని.. అందుకనే పులి తలను వేలానికి పెట్టామని తెలిపారు.

Read more : Wine car : వైన్‌తో నడిచే కారు నడుపుతున్న ప్రిన్స్ చార్లెస్..దటీజ్ రాయల్ రాజకుటుంబం రేంజ్

యూకే తీరుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. భారత్‌ నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులను బహిరంగంగా వేలం వేలానికి పెట్టడానికి సిగ్గులేదా? అంటూ ఫైర్ అవుతున్నారు.దోచుకున్న వస్తువులను విక్రయించడానికి ప్రయత్నించడం, ఎగుమతి నిషేధంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇండియా నుంచి దొంగ‌లించిన టిప్పు సుల్తాన్ సింహాస‌నాన్ని ఎలా వేలం వేస్తారు? యూకే చోర్.. చోర్.. అంటూ నెటిజ‌న్లు మండిపడుతున్నారు.ఇండియ‌న్స్ ఎవ‌రూ కొన‌కుండా.. దానిపై ఎక్స్‌పోర్ట్ బ్యాన్ విధించ‌డం బ్రిటన్ బుద్ధికి నిదర్శమంటూ ఏకిపారేస్తున్నారు.ఇండియా నుంచి దొంగ‌లించి తీసుకెళ్లిన వ‌స్తువుల‌ను అమ్ముకొని బ‌తుకుతున్నారు. వెంట‌నే ఇండియా నుంచి ఎత్తుకెళ్లిన వ‌స్తువుల‌ను రిటర్న్ చేయాలి.. అంటూ మ‌రో యూజ‌ర్ ఫైర్ అయ్యారు.