Antique Spectacles: ఈ కళ్లద్దాల ఖరీదు రూ.25 కోట్లు

17వ శతాబ్దానికి చెందిన రెండు అరుదైన కళ్లద్దాలు వేలంలో 3.5 మిలియన్ డాలర్లు పలికాయి.

Antique Spectacles: ఈ కళ్లద్దాల ఖరీదు రూ.25 కోట్లు

Spectacles

Antique Spectacles: అత్యంత ఖరీదైన వస్తువులు గురించి తెలిసినప్పుడు దాని ఉపయోగాన్ని బట్టి అంత ఖరీదు ఉన్నా.. పరవాలేదులే అనుకుంటాం. కానీ, కళ్లద్దాల ఖరీదు పాతిక కోట్ల రూపాయలంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ..

నిజంగానే ఇది నిజం.. 17వ శతాబ్దానికి చెందిన రెండు అరుదైన కళ్లద్దాలు వేలంలో 3.5 మిలియన్ డాలర్లు పలికాయి. అంటే దాదాపు రూ.25 కోట్లు. వజ్రాలు, రత్నాలతో పొదిగిన కళ్లద్దాలు కావడంతో భారీ ధర పలికాయి. ఈ కళ్లద్దాలు మొగల్ సామ్రాజ్య కాలం నాటివని చెప్తున్నారు. ఇవి పెట్టుకున్న వారు చెడు నుంచి దూరంగా ఉండటంతో పాటు జ్ఞానోదయం కలిగించే పనులు చేస్తుంటారట.

ఇండియాలోని మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని సోత్‌బైకు ఛైర్మన్ అయిన ఎడ్వర్ట్ గిబ్స్ ఈ కళ్లద్దాలు మొఘల్ ఆభరణాల తీరును ప్రతిబింబింపజేస్తాయని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకూ అలాంటివి ఎక్కడా లేవని అన్నారు.

ఇందులో ఒక కళ్లద్దాలు కాంతి వృత్తం అని చెప్తుంటే.. దానిపై గోల్కొండలోని 200క్యారెట్ల వజ్రాన్ని పొదిగారని అంటున్నారు. మరో కళ్లజోడు పచ్చ రంగులో స్వర్గ ద్వారానికి దారి చూపిస్తాయని చెప్తుంటే.. కొలంబియన్ రత్నాలను అమర్చారని చెప్పుకొస్తున్నారు. అప్పట్లో ఏదైనా విలువైన రాయి, వజ్రం, రత్నం దొరికినా మొఘలుల దగ్గరకు తీసుకొచ్చేవారని గిబ్స్ చెప్పారు.