Vijayashanthi : విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ఖండించిన విజయశాంతి

ఈ కూటమి ఓడితే, ఇండియా ఓటమి అని రాయాల్నా అని పేర్కొన్నారు. అయినా, దేశాన్ని స్ఫురింప చేసే ఇట్లాంటి పేర్లు పెట్టే ప్రయత్నాలు స్పష్టంగా ఖండించ తగ్గవేనని తెలిపారు.

Vijayashanthi (1)

Vijayashanthi Criticism Opposition Alliance : బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా విపక్షాల కూటమిపై విమర్శలు చేశారు. విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని విజయశాంతి ట్విట్టర్ లో ఖండించారు. ఓటములు ఎక్కువైతే, తెలివి ప్రమాదం అంచులు దాటి ఇట్లా ఆలోచనలు వచ్చాయి కావచ్చని ఎద్దేవా చేశారు.

ఈ కూటమి ఓడితే, ఇండియా ఓటమి అని రాయాల్నా అని పేర్కొన్నారు. అయినా, దేశాన్ని స్ఫురింప చేసే ఇట్లాంటి పేర్లు పెట్టే ప్రయత్నాలు స్పష్టంగా ఖండించ తగ్గవేనని తెలిపారు. 26 పార్టీలు బెంగళూరులో కలిసి పోరాడుతామన్నప్పుడు దళిత నేత మల్లిఖార్జున ఖర్గే నేతృత్వమన్నా కనీసం ప్రకటిస్తారన్న అభిప్రాయం కొంత వినపడిందన్నారు.

Parliament Monsoon Sessions : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 28 బిల్లులతోపాటు యూసీసీ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

కానీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీ కాదు తామందరం ప్రధాన మంత్రి అభ్యర్ధులమే అన్న ఉద్దేశం కాంగ్రెస్ సహా మిగత 25 కాంగ్రెసేతర పార్టీలది కూడా అన్నట్లు సమావేశం జరిగిందన్నారు. ఏమైనా గత యూపీఏ పేరు తీసివెయ్యటంలోనే కాంగ్రెస్ నేతృత్వ కూటమి వారిది కాదన్న సంకేతం తెలుస్తుందన్నారు.