Anthrax : మాంసం తింటున్నారా..అయితే జాగ్రత్త, ఆంత్రాక్స్ కలవరం..నిపుణుల సూచనలు

పశుసంవర్థక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు.

Antrax

Warangal Anthrax : వరంగల్ జిల్లాలో నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోవడంతో మాంసాహారులు హఢలిపోతున్నారు. మాంసం తినాలా ? వద్దా ? అనే ఆలోచనలో పడిపోయారు. ఈ క్రమంలో…పశుసంవర్థక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా మాంసం విక్రయించే వారికి..తినేవారికి పలు సూచనలు చేశారు. వ్యాధిగ్రస్తమైన జీవాల మాంసాన్ని తినడం, తాకడం, అమ్మడం చేయవద్దని..ప్రజలకు, గొర్రెల కాపరులకు..అమ్మే వారికి సూచనలు చేసింది.

Read More : Blood Pressure : ఈ లక్షణాలుంటే హైబీపి ఉన్నట్లే…జాగ్రత్తపడండి..

అయితే..రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు లేవని, అయినా..ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. మేక లేదా గొర్రె మాంసం కొనేముందు…ఆ జీవాలను పశువైద్యులు తనిఖీలు చేశారా ? లేదా నిర్ధారించుకోవాలని వెల్లడించింది. నమ్మశక్యంగా లేకపోతే..జీవాలను కోసిన ప్రాంతాన్ని ఒకసారి చూడాలని సూచించింది. జీవాలను కోసినప్పుడు వెలువడే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆ జీవానికి ఆంత్రాక్స్ సోకినట్లు గుర్తించాలని తెలిపింది.
ఈ వ్యాధిలతో చనిపోయిన జీవాల కళేబరాలను తగిన జాగ్రత్తలు తీసుకుని పూడ్చకపోతే…బయటకు వచ్చే సూక్ష్మ క్రిములు నేలలో ఏళ్ల తరబడి పాతుకపోతాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

Read More : Bahadurpura : నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి..బాలుడు ఆత్మహత్య

మాంసం కొనేటప్పుడు అధికారులు, నిపుణులు వెల్లడించిన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం..పశువైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉందని ధృవీకరించిన జీవాలనే కోసి మాంసాన్ని విక్రయించాలని అమ్మే యజమానులకు సూచించింది. రోడ్ల పక్కన కోసి అమ్మే మాంసాన్ని అస్సలు కొనవద్దని, జీవాలను కోశాక..వాటి శరీరాన్ని నేలపై పడకుండా…గాలిలో వేలాడదీయాలన్నారు. కనీసం వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించాలని..అప్పుడే మాంసాన్ని తినాలని తెలిపారు. సరిగ్గా ఉడకని మాంసాన్ని ఎట్టిపరిస్థితుల్లో తినరాదని సీనియర్ అధికారులు వెల్లడిస్తున్నారు.