Minister KTR : రాహుల్ గాంధీ సవాల్ ను స్వీకరిస్తున్నాం.. కేసీఆర్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారు : మంత్రి కేటీఆర్

ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలవకుండా సిటీ కాలేజీలో ఆందోళన చేస్తుంటే ఐదుగురిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.

Minister KTR (6)

Minister KTR – Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కరెంటు కోతలు, మత కల్లోలాలు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బక్కపల్చని కేసీఆర్ ను ఓడించేందుకు మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను కుర్చీలో కూర్చోబెట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ సవాల్ ను స్వీకరిస్తున్నామని వెల్లడించారు.

ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలవకుండా సిటీ కాలేజీలో ఆందోళన చేస్తుంటే ఐదుగురిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. 370 మంది తెలంగాణ ఉద్యమ కారులను కాల్చి చంపిన చరిత్ర ఇందిరాగాంధీది పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మన బిడ్డల్ని చంపి పదేళ్లకు తెలంగాణ ఇచ్చారని తెలిపారు.

Yashaswini Reddy : పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి పోటీపై అభ్యంతరాలు.. నిబంధనలకు విరుద్ధమని నోటీసులు

ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలతో అయ్యేది ఏం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఉండగా ఢిల్లీ, గుజరాత్ వాళ్ళు అవసరమా అని ప్రశ్నించారు. ఢిల్లీ, గుజరాత్ వాళ్ళతో తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్ వాళ్లకు 11 ఛాన్స్ లు ఇచ్చారు…అందుకే ఒక్క చాన్స్ ఇవ్వొద్దని తెలిపారు.

తెలంగాణ తలసరి ఆదాయం, వ్యవసాయం పెరిగిందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. పదేళ్లలో కరెంటు, సాగు నీరు, త్రాగు నీరు ప్రజలకు అందిందన్నారు. హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇళ్లు లేదన్నారు.

Natti Kumar : రామ్ గోపాల్ వర్మ నాకు పేమెంట్స్ ఇవ్వాలి.. అవి ఇవ్వకుండా వ్యూహం సినిమా రిలీజ్ చేయలేడు : నట్టి కుమార్

తెలంగాణ అణువణువు కేసీఆర్ కు తెలుసన్నారు. వరంగల్ లో అనేక కంపెనీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా వలన లక్ష కోట్ల నష్టం వచ్చిందన్నారు. వరంగల్ నగరంలో మెట్రోను నిర్మిస్తామని చెప్పారు. కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ కు మద్దతుగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.