Yashaswini Reddy : పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి పోటీపై అభ్యంతరాలు.. నిబంధనలకు విరుద్ధమని నోటీసులు
యశస్విని రెడ్డి పోటీపై అడ్వకేట్ రాజేశ్ కుమార్, సామాజిక కార్యకర్త శివ కుమార్ అభ్యంతరం తెలిపారు. యశస్వినిరెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు.

Yashaswini Reddy Contest Objection
Yashaswini Reddy Contest Objection : పాలకుర్తి కాంగ్రెస్ పాలిటిక్స్ లో మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి పోటీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. యశస్విని రెడ్డి పోటీపై అడ్వకేట్ రాజేశ్ కుమార్, సామాజిక కార్యకర్త శివ కుమార్ అభ్యంతరం తెలిపారు. యశస్వినిరెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు. ఏడాదిలో 183 రోజులు దేశంలో నివసించలేదని లేఖలో పేర్కొన్నారు. కనీసం 180 రోజులు దేశంలో నివసించకపోతే ఓటు హక్కు కోల్పోతారని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత, ఎన్నారై ఝాన్సీరెడ్డి భారత పౌరసత్వాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిరాకరించారు.
ఎన్నారై ఝాన్సీరెడ్డి భారత పౌరసత్వం నిరాకరణ
ఎన్నారై ఝాన్సీ లక్ష్మీ రెడ్డికి భారత పౌరసత్వం నిరాకరించిన విషయ తెలిసిందే. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ లక్ష్మీ రెడ్డి భావించారు. కానీ, ఆమె భారత పౌరసత్వం నిరాకరించారు. ఈ మేరకు అక్టోబర్ 4వ తేదీనే ఎన్నారై ఝాన్సీ లక్ష్మీ రెడ్డి భారత పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధికారిక లేఖ విడుదల చేశారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని పాలకుర్తి కాంగ్రెస్ అభర్థిగా పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Janasena : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించిన జనసేన
అయితే ఝాన్సీరెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆమె భారత పౌరసత్వాన్ని నిరాకరించారు. అంగ, అర్ధబలంతో ఢీకొట్ట గల సత్తా ఉన్న ఝాన్సీరెడ్డిని బరిలో దింపి మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించాలని ప్లాన్ వేసిన రేవంత్ రెడ్డి వర్క్ అవుట్ అయ్యే పరిస్థితి కనపించడం లేదు. పౌరసత్వ సమస్య తెరమీదకు తెస్తారని ఊహించే ఝాన్సీరెడ్డి ముందు నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆమె సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.
సకాలంలో భారత పౌరసత్వం వస్తుందో రాదో అన్న సందేహంతో కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎన్నారై ఝాన్సీరెడ్డి తన పౌరసత్వం విషయంలో టెక్నికల్ అంశాలు అడ్డొస్తే తన కోడలు యశస్వినిరెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు. భారత పౌరసత్వం కలిగిన యశస్వినికి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు.
కానీ, ఇప్పుడు యశస్విని రెడ్డి పోటీపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. యశస్విని రెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని అడ్వకేట్ నోటీలు ఇచ్చారు. ఒకవైపు ఝాన్సీరెడ్డి భారత పౌరసత్వాన్ని నిరాకరించడం, మరోవైపు ఆమె కోడలు యశస్వినిరెడ్డి పోటీపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి పోటీపై సందిగ్ధత నెలకొంది.