Weather Report : బీ అలర్ట్, నాలుగు రోజులూ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు

Telangana Rain : నైరుతి రుతపవనాలు తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరిస్తున్నాయి. అనుకున్న సమయానికి కంటే ముందుగానే వచ్చిన రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబైని రుతుపవనాలు తాకాయి. ఒక్కరోజు వర్షానికే ముంబై తల్లడిల్లింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 2021, జూన్ 10వ తేదీ గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో…హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఆవర్తనం వ్యాపించిందని, రాగల 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా మీదుగా వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేశారు.

అల్పపీడన ప్రాంతం నుండి ఒడిస్సా మీదగా తెలంగాణా వరకు ద్రోణి ఏర్పడిందని, 11వ తేదీ శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావం వల్ల రాగల నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రధానంగా..ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక 12,13 తేదీల్లో కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. ఇక గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయన్నారు.

Read More : Covid Vaccine-Heart Issue : కొవిడ్ వ్యాక్సిన్‌తో గుండె సమస్యలు.. యువతలోనే ఎక్కువ : CDC

ట్రెండింగ్ వార్తలు