Etela Rajender : ఈటల నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ?

Medak District Collector : అసైన్డ్ భూముల ఆక్రమణలు ఎదుర్కొంటూ..మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన..ఈటల ఏం చేయబోతున్నారు ? ఇప్పుడు ఇదే ప్రశ్న పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి పదవి పోగా..నిన్న ఏకంగా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు సీఎం కేసీఆర్.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 66 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించినట్లు కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ తో పాటు..కబ్జా, అటవీ చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వరుసగా మూడు రోజుల నుంచి జరుగుతున్న అంశాలు ఈటలను ఇరుకున పెడుతున్నాయి. ఆయన ఏం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతారా ? అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో…2021, మే 03వ తేదీ సోమవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Read More : Corona Guideline : కరోనా ఎఫెక్ట్..కర్రలతో దండలు మార్చుకున్న వధూవరులు

ట్రెండింగ్ వార్తలు