Corona Guideline : కరోనా ఎఫెక్ట్..కర్రలతో దండలు మార్చుకున్న వధూవరులు

బీహార్ లోని బెగుసరాయ్ లో తెఘ్డా ప‌రిధిలోని తెఘ్రా బజార్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..పెళ్లి చేసుకున్నారు. వధూవరులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు.

Corona Guideline : కరోనా ఎఫెక్ట్..కర్రలతో దండలు మార్చుకున్న వధూవరులు

Marrige

 Bride Groom : కరోనా ఎప్పుడు తగ్గిపోతుందిరా బాబు..అనుకుంటున్నారు జనాలు. సామాన్యుడి నుంచి మొదలుకుని..సెలబ్రెటీల వరకు వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ అంటేనే జడుసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ ప్రతి రంగంపై పడిపోయింది. ప్రధానంగా..మంచి ముహూర్తాలున్న ఈ టైంలో పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్న వారు ఉస్సూరుమంటున్నారు. ప్రభుత్వాలు కూడా కఠిన నిబంధనలు విధిస్తుండడంతో పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. కొంతమంది కొంతమంది అతిథులు మధ్యే వివాహాలు చేసుకుంటున్నారు.

అయతే..ఓ జంట చేసుకున్న పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీహార్ లోని బెగుసరాయ్ లో తెఘ్డా ప‌రిధిలోని తెఘ్రా బజార్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..పెళ్లి చేసుకున్నారు. వధూవరులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు. ప్రధానంగా దండలు మార్చుకొనే ప్రక్రియ చాలా విచిత్రంగా జరిగింది. వ‌ధూవ‌రులిద్ద‌రూ చెరో రెండు క‌ర్ర‌లు తీసుకుని, వాటికి దండ‌లు త‌గిలించి పర‌స్ప‌రం మార్చుకున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..తాము చేసుకున్న ఈ పెళ్లి జీవితాంతం గుర్తుండి పోతుందని వరుడు వెల్లడించారు. క‌ర్ర‌ల‌తో దండ‌లు మార్చుకునే తంతు ఎంతో న‌చ్చింద‌న్నారు. ఇక ఈ వివాహానికి కేవలం 50 మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

Read More :  India LockDown : లాక్‌డౌన్‌ విధింపును పరిశీలించండి.. ఆక్సిజన్ కొరతను పరిష్కరించండి : సుప్రీం