Love Marriage : ప్రేమించి పెళ్ళిచేసుకుని.. వారానికే వద్దన్నాడు

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగడంతో ఆ యువతి చాలా సంతోషపడింది. కోరుకున్నవాడు భర్తగా రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతలోనే అత్తింటివారి నుంచి వీరి పెళ్ళికి అభ్యంతరం రావడంతో యువతి ఆత్మహత్యాయత్నంకు యత్నించింది.. ఖమ్మం ఆసుపత్రికి చికిత్స పొందుతుంది.

Love Marriage :  ప్రేమించి పెళ్ళిచేసుకుని.. వారానికే వద్దన్నాడు

New Project (1)

Updated On : August 5, 2021 / 2:57 PM IST

Love Marriage : ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగడంతో ఆ యువతి చాలా సంతోషపడింది. కోరుకున్నవాడు భర్తగా రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతలోనే అత్తింటివారి నుంచి వీరి పెళ్ళికి అభ్యంతరం రావడంతో యువతి ఆత్మహత్యాయత్నంకు యత్నించింది.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన మద్దెబోయిన సత్యవతికి మగదిక్కు లేదు. 22 ఏళ్ల కుమార్తెతో శృతితో కలిసి ఇల్లేందు పాత బస్టాండ్ ఏరియాలో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. కూతురు శృతి కూడా పట్టణంలో ఓ స్వీట్ షాపులో పనిచేస్తోంది.

ఈ క్రమంలోనే ఆమెకు బస్టాండ్ బస్తీకి చెందిన 23 ఏళ్ల దినేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో వారం క్రితం పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొత్తగూడెంలో రుద్రంపూర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఈ పెళ్లి ఇష్టం లేని దినేష్ తల్లిదండ్రులు, బంధువులు ఎలాగైనా విడగొట్టాలని ప్లాన్ వేశారు. దినేష్ స్నేహితులను బెదిరించి వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకున్నారు. దినేష్ కుటుంబ సభ్యులు, బంధువులు కొత్తగూడెం వెళ్లి శృతిని గదిలోంచి బయటకు లాగి కొట్టి అనంతరం ఆమె తల్లికి అప్పగించారు.. దినేష్ ను తీసుకోని వెళ్లిపోయారు.

ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత శృతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ దినేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల ఒత్తిడితో దినేష్ కూడా శృతి అంటే ఇష్టం లేదని తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన శృతి హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నించింది.. కూతురుని గమనించిన తల్లి వెంటనే ఆమెను ఇల్లేందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.