Banjara Hills : భర్తను చున్నీతో హత్యచేసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

కట్టుకున్న భర్తను హత్యచేసి.. గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించింది మాయ లేడి

Banjara Hills : భర్తను చున్నీతో హత్యచేసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

Banjara Hills

Updated On : September 16, 2021 / 9:05 AM IST

Banjara Hills : కట్టుకున్న భర్తను హత్యచేసి.. గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించింది మాయ లేడి..ఈ ఏడాది జులై 16న ఈ ఘటన జరగ్గా.. 11 ఏళ్ల కొడుకు జరిగిన విషయం తన బాబాయికి చెప్పడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు జగదీష్ కు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే సుశ్రీతను 2007లో వివాహం జరిగింది.

Read More : Afghanistan : పాక్‌లో అప్ఘాన్ మహిళల ఫుట్ బాల్ జట్టు

వీరు గత కొంతకాలంగా 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఫిలింనగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్య సుశ్రీత జులై 16న భర్త హత్యకు కుట్రపన్నింది. చున్నీతో ఉరివేసి హత్యచేసింది. ఆ తర్వాత బందువులకు ఫోన్ చేసి గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు జగదీష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Read More : Saidabad Raju : చిన్నారి ఇంటి వద్ద షర్మిల దీక్ష భగ్నం, రూ 10 కోట్లు ఇవ్వాలి

అయితే తన తండ్రికి గుండెపోటు రాలేదని తల్లే హత్యచేసిందని 11 ఏళ్ల బాలుడు తన బాబాయ్ ప్రసాద్ కి చెప్పడంతో అతడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.