Saidabad Raju : చిన్నారి ఇంటి వద్ద షర్మిల దీక్ష భగ్నం, రూ 10 కోట్లు ఇవ్వాలి

సైదాబాద్‌ చిన్నారి ఇంటి వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చిన్నారి ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదని దీక్షకు కూర్చున్నారు షర్మిల.

Saidabad Raju : చిన్నారి ఇంటి వద్ద షర్మిల దీక్ష భగ్నం, రూ 10 కోట్లు ఇవ్వాలి

Sharmila

Saidabad : సైదాబాద్‌ చిన్నారి ఇంటి వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చిన్నారి ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదని దీక్షకు కూర్చున్నారు షర్మిల. దీంతో అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి… షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల దీక్షకు విజయమ్మ సంఘీబావం తెలిపారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని షర్మిల స్పష్టం చేశారు. చిన్నారి కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారం ప్రకటించాని డిమాండ్ చేశారు.

Read More : Saidabad : మానవ మృగం రాజు ఎక్కడ ? పట్టుకొనేందుకు 70 ప్రత్యేక టీమ్‌లు. 1000 పోలీసులు

మృగాడి చేతిలో బలైన చిన్నారి కుటుంబానికి రాజకీయ పరామర్శలు పెరిగాయి. బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. బాధితుల ఇంటివద్ద జనం భారీగా గుమిగూడటంతో.. బాధిత కుటుంబ సభ్యులను ఇంటి బయట వీధిలోనే పరామర్శించారు పవన్‌. నిందితుడ్ని కఠినంగా శిక్షించడంతో పాటు బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పార్టీలకతీతంగా అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే చేయాలన్నారు పవన్.

Read More : PM Modi: “పీఎం మోదీ పంపారు.. డబ్బులు తిరిగిచ్చేదే లేదు”

చిన్నారి హత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని.. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు హోంమంత్రి. నిందితుడు రాజుకు కఠినంగా శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.