Saidabad : మానవ మృగం రాజు ఎక్కడ ? పట్టుకొనేందుకు 70 ప్రత్యేక టీమ్‌లు. 1000 పోలీసులు

చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజును పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

10TV Telugu News

Saidabad Rapist Raju : చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజును పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పట్టిస్తే 10 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన పోలీసులు.. రాజు ఎలా ఉంటాడో ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం జుట్టుతో ఉన్న రాజు గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడో కూడా ఫోటోలు విడుదల చేశారు. హైదరాబాద్ వాసులే కాకుండా.. ఇతర జిల్లాల ప్రజలు కూడా రాజును గుర్తుపట్టేలా బస్సులపై పోస్టర్లు అంటిస్తున్నారు. ఫోటోలు పట్టుకుని ఇతన్ని ఎక్కడైనా చూశారా అంటూ అరా తీస్తున్నారు. ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే.. ఆచూకీ చెప్పాలంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Read More : Kerala Lovers : రెహమాన్‌-సజితా పెళ్లి చేసుకున్నారు

భారీ సెర్చ్ ఆపరేషన్ : –
ఓవైపు రాజు ఎలా ఉంటాడో ప్రజలకు వివరిస్తూనే.. మరోవైపు అతడ్ని పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసి.. గాలింపు చేపట్టారు. 70కి పైగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ఆ మానవ మృగం కోసం వేటాడుతున్నారు. రేపిస్టు రాజుకు మద్యం తాగే అలవాటు ఉండడంతో.. రాష్ట్రంలోని 2వేలకు పైగా మద్యం దుకాణాలు, కల్లు కాంపౌడ్ల వద్ద గస్తీ పెంచారు. ఇప్పటికే షాపుల యజమానులు, సిబ్బందిని అలర్ట్ చేశారు. ప్రతీ మద్యం దుకాణం ఎదుట రాజు ఫోటోలను అంటిస్తున్నారు.  హైదరాబాద్‌లోని కూలీ అడ్డాల వద్ద.. ప్రతీ గల్లీలోనూ పోలీసులు గాలిస్తున్నారు. రాజును ఎలాగైనా పట్టుకునేందుకు వేలకొద్దీ సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Read More : Telugu states : ఒకే రోజు..తెలుగు రాష్ట్రాల కేబినెట్ మీటింగ్

ఘట్ కేసర్ లో రాజు  : –
బాలికను కిరాతకంగా చంపేసిన తర్వాత.. ఎల్‌బీనగర్‌ వెళ్లిన రాజు.. అక్కడ ఓ ఆటోను దొంగిలించబోయి డ్రైవర్‌ అప్రమత్తతతో అక్కడి నుంచి పారిపోయాడు. ఎల్బీనగర్‌ నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లి.. అక్కడే ఓ వైన్‌షాపులో మద్యం సేవించినట్లు గుర్తించారు పోలీసులు. నాగోల్‌ నుంచి బస్సులో ఉప్పల్‌కు.. అక్కడి నుంచి ఘట్‌కేసర్‌ వైపు నిందితుడు రాజు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. మోత్కూరు బస్సు ఎక్కిన రాజు అక్కడి నుంచి వలిగొండకు.. అటు నుంచి చిట్యాల.. అక్కడి నుంచి నల్గొండకు వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి పంతంగి వెళ్లిన రాజు.. రెడ్డిబావి సమీపంలో కాలినడకన తిరిగినట్లు గుర్తించారు పోలీసులు.

Read More : 13 Members On Bike : ఇదేందయ్యా ఇది.. ఏడా చూడలె.. ఒకే బండిపై 13మంది..

రాజు ఎలా తప్పించుకుంటున్నాడు : –
దీంతో.. రాజు ఎక్కడెక్కడ తిరిగాడు..? ఎక్కడికి వెళ్లాడు..? ఎక్కడ ఉన్నాడు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌ టాస్క్ ఫోర్స్‌ అదుపులో ఉన్న రాజు స్నేహితున్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అత్యాచారం తర్వాత.. ఎల్‌బీ.నగర్‌ వరకు స్నేహితునితో కలిసి వెళ్లాడు రాజు. అయితే.. అక్కడ స్నేహితుడితో నిందితుడు ఏం మాట్లాడాడు..? రాజును అతని స్నేహితుడు ఎక్కడ ఎలా కాంటాక్ట్‌ అయ్యాడు..? రాజు ఫోన్ స్విచాఫ్‌లో ఉంటే స్నేహితున్ని ఎలా కలిశాడు..? అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. జాతీయ రహదారులతో పాటు.. అన్ని రూట్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. రాజు ఫొటోలు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తున్నారు. పోలీసులు ఇంతగా గాలిస్తున్నా.. రాజు  ఎలా తప్పించుకు తిరుగుతున్నాడు? అసలు ఎక్కడున్నాడనేది పోలీసులకు సవాల్‌గా మారింది.

Read More : కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

ట్రేస్ చేయడం కష్టం : –
రాజు ఫోన్ వినియోగించకపోవడంతో అతడ్ని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. అందువల్లే అతడు తప్పించుకు తిరగగలుతున్నాడని అంటున్నారు. ఎలాగైనా అతడ్ని పట్టుకోవాలని పట్టుదలతో పని చేస్తున్నారు. చిన్నారి హత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని.. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు హోంమంత్రి. నిందితుడు రాజుకు కఠినంగా శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.